తల్లితో పాటు ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపించడానికి ఓ మిడిల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చిన ఉదాంతం తాజాగా బయటపడింది.సెయింట్ లూయిస్‌లో మిడిల్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న కార్నెలియస్ ఎమ్ గ్రీన్( Cornelius M Green ) అనే వ్యక్తి గర్భవతి అయిన ఒక టీచర్‌ను చంపడానికి ఫ్రెండ్‌కు డబ్బు ఇచ్చాడు.
ఆ నేరాన్ని తాజాగా ఒప్పుకున్నాడు.ఆ టీచర్ పేరు జోస్లిన్ పీటర్స్( Jocelyn Peters ) .ఆమె మన్ ఎలిమెంటరీ స్కూల్‌లో పని చేసింది.కార్నెలియస్ కార్ లేన్ విజువల్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ మిడిల్ స్కూల్‌లో పనిచేశాడు.
గ్రీన్ మరొకరిని వివాహం చేసుకున్నాడు, జోస్లిన్ పీటర్స్‌తో మాత్రం సీక్రెట్ అఫైర్ పెట్టుకున్నాడు.పీటర్స్ 2015లో గ్రీన్ వల్ల ఓ బిడ్డకు గర్భం దాల్చింది.
అయితే 2016లో గ్రీన్ తన కోసం పీటర్స్‌ని చంపమని తన పాత స్నేహితుడు ఫిలిప్ జె కట్లర్‌ని( Philip J Cutler ) కోరాడు.అతను కట్లర్‌కు 2,500 డాలర్లు ఇచ్చాడు.మిడిల్ స్కూల్ నుంచి ఆ డబ్బులు తీసుకున్నాడు.కట్లర్ ఓక్లహోమా నుంచి సెయింట్ లూయిస్‌కు వచ్చి గ్రీన్ ఇంట్లో బస చేశాడు.ఈ హత్యలో తన ప్రమేయం లేదన్నట్లు గ్రీన్ చేయాలనుకున్నాడు.అందుకే రైలులో చికాగో వెళ్లాడు.
కట్లర్‌కు పీటర్స్ అపార్ట్‌మెంట్ చూపించి వెళ్ళిపోయాడు.
2016, మార్చి 24న కట్లర్ నిద్రిస్తున్న సమయంలో జోస్లిన్ పీటర్స్ తలపై కాల్చి చంపాడు.తుపాకీని నిశ్శబ్దంగా చేయడానికి అతను బంగాళాదుంపను ఉపయోగించాడు.కట్లర్ చేసిన పని కారణంగా పీటర్స్, ఆమె బిడ్డ చనిపోయారు.
ఆ రోజు గ్రీన్ సెయింట్ లూయిస్‌కు తిరిగి వచ్చాడు.పీటర్స్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి ఏం జరిగిందో తెలియనట్లు వ్యవహరించాడు.
కానీ పోలీసులు కనిపెట్టారు.గ్రీన్ అతను రెండు నేరాలకు పాల్పడినట్లు చెప్పాడు.
సెయింట్ లూయిస్ సర్క్యూట్ అటార్నీకి చెందిన ఆఫీస్ గ్రీన్‌తో ఒప్పందం చేసుకుంది.జీవిత ఖైదుకు వెళ్లేందుకు అంగీకరిస్తే హత్యా నేరం మోపబోమని చెప్పారు.
అతని విచారణ మార్చి 11న ప్రారంభమవుతుంది.