తెలంగాణలో అప్రతిహితంగా తిరుగులేని నాయకుడుగా దూసుకుపోతూ కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెకలించే ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కి మొదటి సారి ఊహించని దెబ్బ తగిలింది.ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.
పార్టీ ప్రాథమిక సభ్యుత్వానికి రాజీనామా చేసి ఇక తాను టీఆర్ఎస్ పార్టీలో పనిచేయలేనని స్పష్టం చేసేసాడు.వెళ్తూ వెళ్తూ టీఆర్ఎస్ పార్టీ మీద సోమారపు సంచలన వాఖ్యలు చేసారు.
టీఆర్ఎస్ పార్టీలో అరాచకం, నియంతృత్వం పెరిగిపోయిందని, పార్టీ సభ్యుత్వ పుస్తకాలు కూడా తనకి ఇవ్వకుండా కొందరు అదే పనిగా అవమానిస్తున్నారని ఆరోపించారు.కావాలని తనని ప్రతి సారి అవమానించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే ఇక ఈ పార్టీలో ఇమడలేక బయటకి వస్తున్నా అని చెప్పుకొచ్చారు.
అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ తనకి అడగకుండానే ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చారని, కాని కొందరి కారణంగా పార్టీ నుంచి బయటకి వచ్చేస్తున్నా అని స్పష్టం చేసారు.అయితే ఆయనికి బీజేపీ పార్టీ నుంచి పెద్ద ఆఫర్ రావడంతోనే బయటకి వచ్చి ఆ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారని టాక్ రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
దీనికి అతను ఏవో కారణాలు చెబుతున్నారు అంటూ టీఆర్ఎస్ వర్గాలు విమర్శలు చేస్తున్నాయి.







