ఈ రోజున మనం ఔషదాలను వదలి సహజ నివారణల వైపు వెళ్ళుతున్నాం.కానీ మన పూర్వీకులు వందల సంవత్సరాల క్రితం నుండి సహజ నివారనలను వాడుతున్నారు.
మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులను ఉపయోగించి అనేక సహజ నివారణలను తయారుచేసుకోవచ్చు.వీటిని వాడుట వలన ఎటువంటి దుష్ప్రభావాలు కలుగవు.
వాటిలో పుదినా ఒకటి.దీనిలో మనం ఊహించని విధంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
1.క్షయ
ఇది సాదారణంగా ఊపిరితిత్తులకు వచ్చే తీవ్రమైన వ్యాదిగా చెప్పవచ్చు.ఒక్కో సారి ఈ క్షయ వ్యాది కారణంగా మరణం కూడా సంభవించవచ్చు.ఈ ప్రమాదకరమైన వ్యాధి, అభివృద్ధి చెందిన దేశాలలో సర్వసాధారణం కాదు.కానీ హెచ్ఐవి కారణంగా వ్యాధి నిరోధక శక్తి ప్రభావితం అయ్యి క్షయ ప్రేరితం అవుతుంది
పుదినా నూనెను పీల్చితే మంట నుంచి ఉపశమనం మరియు మరల రాకుండా ఉండటానికి సహాయపడుతుంది.అలాగే మనకు ఇష్టమైన పండ్ల రసంలో తేనె, తాజా పుదీనా రసం,వెనిగర్ కలిపి కూడా త్రాగవచ్చు.
2.క్యాన్సర్
పుదినా క్యాన్సర్ రోగులలో కెమోథెరపీ మరియు వికారం కొరకు చాలా బాగా పనిచేస్తుంది.వాంతులు మరియు వికారం ఎదుర్కోవటానికి పుదినా మందుల కన్న ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది.పుదినా ఆకులను నమలవచ్చు లేదా ఆహారంలో కలిపి తీసుకోవచ్చు.
3.మైగ్రైన్ మరియు టెన్షన్ తలనొప్పులను తగ్గిస్తుంది
మైగ్రైన్ మరియు టెన్షన్ తలనొప్పి ఉన్నప్పుడు పుదినా నూనెను నొసల మీద రాసుకొని రబ్ చేసుకుంటే సరిపోతుంది.లేదా కొన్ని పుదినా ఆకులను క్రష్ చేసి వాసన చూసిన చాలు.
4.ఒత్తిడిని తగ్గిస్తుంది
ఒత్తిడిలో ఉన్నప్పుడు పుదినా నూనెలు చల్లని ప్రభావం మరియు శక్తిని అందిస్తాయి.స్నానం చేయటానికి ముందు నూనెను చర్మానికి రాసుకొని మసాజ్ చేసుకోవాలి.అప్పుడు విశ్రాంతి మరియు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తుంది.
5.చికాకుపెట్టే పేగు వ్యాధి
మలబద్ధకం లేదా అనియంత్రిత డయేరియా,తిమ్మిరి,కడుపు నొప్పి,ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు పుదినా బాగా సహాయపడుతుంది.పుదినాను సలాడ్స్,సూప్ ,టీ ల రూపంలో తీసుకోవచ్చు.
పుదినాలో పిప్పరమెంటు ఉండుట వలన జీర్ణక్రియ ఉద్దీపన మరియు గ్యాస్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.అంతేకాక వేగంగా ఫుడ్ ప్రాసెసింగ్ మరియు పేగు కండరాలను సడలించటానికి సహాయపడుతుంది.