సినిమా ఇండస్ట్రీలో తిమ్మిని బమ్మిని చేస్తే గాని ఎవరు నమ్మరు.మనకి ఏమీ లేకపోయినా సరే ఎంతో ఉంది అని చెప్పుకోవాల్సి వస్తుంది.
అలాంటివారికి అవకాశాలు దొరుకుతాయి.కానీ కొన్ని కోట్లు ఇచ్చినా కూడా కొంతమంది నటీనటులు సెలబ్రిటీస్ కొన్ని పనులు చేయడానికి ఇష్టపడరు.
అవకాశం కోసం లేదా డబ్బు పేరు కోసం తమ నిజాయితీని తాకట్టు పెట్టకుండా పనిచేస్తారు.అలాంటి వారు ఎవరు ఇండస్ట్రీలో మనుగడ ఎక్కువ రోజులు సాధించలేరు అయినా కూడా తమ కష్టంతోనే పైకి వస్తామని ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదని మడి కట్టుకుని కూర్చున్న కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు వారెవరో ఈ ఆర్టికల్ లో చూద్దాం.
దేవి శ్రీ ప్రసాద్( Devisri Prasad ) ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆయనకు చాలామంది దర్శక నిర్మాతలు హాలీవుడ్ ట్యూన్స్ ఇచ్చి వాడిని కాస్త అటు ఇటు మార్చి తెలుగు సినిమాలకు వాడేయమని చెప్పేవాళ్లట కానీ అందుకు ఆయన ఒప్పుకోకుండా తనకు వచ్చిన సంగీతం చేసుకుంటూ వచ్చారు.ఇంకా హీరో వెంకటేష్( Venkatesh ) కూడా చాలా నిజాయితీగా వంద రోజులు ఆదన సినిమాల ఇంకా హీరో వెంకటేష్ కూడా చాలా నిజాయితీగా వంద రోజులు ఆడకపోయినా ఆడాయి అని ఏరోజు చెప్పుకోలేదు చాలామంది 98 రోజులు 99 రోజులు ఆడినా కూడా 100 రోజులు అని చెప్పుకుంటారు.చాలాసార్లు వెంకటేష్ 98 రోజులకే థియేటర్ నుంచి తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇక హిట్ 2 సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన కోమలి ప్రసాద్ ని( Komalee Prasad ) చాలామంది తాను హిందీ నుంచి వచ్చాను అంటూ చెప్పుకోమనేవారట.కానీ తాను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తెలుగు అమ్మాయి గాని అవకాశాల కోసం అడుగుతాను కానీ హిందీ పేరు చెప్పుకొని అబద్ధాలు చెప్పను, మోసం చేయను అంటూ కరాకండిగా చెప్పేవారట.ఇక సాయి పల్లవి( Sai Pallavi ) గురించి ఎంత చెప్పినా తక్కువే ఆమె మొహానికి వాడే పేస్ క్రీమ్ గురించి అడ్వటైజ్ చేయమని రెండు కోట్లు ఇస్తానన్నా కూడా తాను వాడలేని ఒక ప్రోడక్ట్ గురించి జనాలను వాడమని మోసం చేయను అంటూ చెప్పేశారట.
ఇక ఆ సంపూర్ణేష్ బాబు( Sampoornesh Babu ) సైతం తను మొదట ఎన్నారై అంటూ చెప్పుకున్నాడు.కానీ ఆ తర్వాత తన నిజ జీవితం గురించి ఇంటర్వ్యూ ఇచ్చి మరీ ఓపెన్ చేశాడు తెలుగువారిని మోసం చేయడం ఇష్టం లేకనే తన గురించి నిజాయితీగా నిజాన్ని చెప్పాడు.