నెలసరి సమయంలో ఖచ్చితంగా తాగాల్సిన టీ ఇది.. ఎందుకో తెలుసా?

సాధారణంగా చాలా మంది మహిళలకు నెలసరి అనేది ఎంతో బాధాకరంగా సాగుతుంది.నడుము నొప్పి, కడుపు నొప్పి, కాళ్లు లాగడం వంటివి తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి.

 This Tea Was Very Good For Painful Menstruation! Painful Menstruation, Menstruat-TeluguStop.com

వీటికి తోడు అధిక రక్తస్రావం, కళ్ళు తిరగడం, నీరసం, తిమ్మిర్లు ఇలా ఎన్నో సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి.అయితే వీటన్నిటికీ చెక్ పెట్టడానికి ఆ సమయంలో కొన్ని ఆహారాలు ఎంతో బాగా సహాయపడుతుంటాయి.

అటువంటి వాటిలో మందారం టీ కూడా ఒకటి.నెలసరి సమయంలో కచ్చితంగా తాగాల్సిన టీ ఇది.

మందారం టీ అంటే పెద్దగా కష్టపడి పోవాల్సిన అవసరం ఏమీ లేదు.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర గ్లాసుల వాటర్ పోసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు మందారం పొడి రేకులు వేసి రెండు గంటలు నానబెట్టాలి.ఆ తర్వాత ఈ గిన్నెను స్టవ్ పై పెట్టి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు వాట‌ర్ ను మరిగిస్తే కలర్ మారుతుంది.

అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి టీ ని ఫిల్టర్ చేసుకోవాలి.

Telugu Tips, Hibiscus Tea, Hibiscustea, Latest, Painful, Period Pain, Periods-Te

ఈ మందారం టీ లో వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ), వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, చిటికెడు దాల్చిన చెక్క( Cinnamon ) పొడి కలిపి సేవించాలి.ఈ మందారం టీ టేస్టీగా ఉండడమే కాదు హెల్త్ కు ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా నెలసరి నాలుగు రోజులు మందారం టీ ని తీసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి.

మందారం టీ అనేది న్యాచురల్ పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది.ఆ సమయంలో కడుపునొప్పి, నడుము నొప్పి ఇలా ఎలాంటి నొప్పులు ఉన్నాస‌రే మందారం టీ తాగితే తగ్గు ముఖం పడతాయి.

Telugu Tips, Hibiscus Tea, Hibiscustea, Latest, Painful, Period Pain, Periods-Te

అలాగే మందార టీ( Hibiscus tea ) మూడ్ ను ఉత్సాహంగా మారుస్తుంది.నీరసం, అలసట, చిరాకు వంటి వాటిని దూరం చేస్తుంది.ఒత్తిడిని తగ్గిస్తుంది.ఒకవేళ మందారం టీ ను రోజు కనుక తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది.గుండెపోటు వచ్చే రిస్క్ తగ్గుతుంది.కిడ్నీ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.

వెయిట్ లాస్ అవుతారు.మందారం టీ లో విటమిన్ సి రిచ్ గా ఉంటుంది.

కాబట్టి మందారం టీ ను డైట్ లో చేర్చుకుంటే ఇమ్యూనిటీ సిస్టమ్ ౠస్ట్ అవుతుంది.చర్మం నిగారింపుగా సైతం మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube