అడవిలో బతకాలంటే బలం, వేగం ఉండాలి.కానీ ఒక్కోసారి ప్రకృతిలో మంచితనం కూడా కనిపిస్తుంది.
మొన్నటిదాకా వైరల్ అయిన ఒక వీడియో చూస్తే మీరు షాక్ అవుతారు.ఏనుగు, సింహం మధ్య ఏం జరిగిందో చూస్తే మాత్రం మీరు నిజంగా ఆశ్చర్యపోతారు.‘నేచర్ ఈజ్ అమెజింగ్’( Nature is Amazing ) అనే ఫేమస్ X (ట్విట్టర్) పేజీలో ఈ వీడియో షేర్ చేశారు.దీనికి లక్షల్లో వ్యూస్, వేలల్లో లైకులు వచ్చాయి.
పచ్చిక బయళ్లలో ఒక సీన్.ఒక పెద్ద ఏనుగు, హాయిగా రెస్ట్ తీసుకుంటున్న సింహం, దాని బుజ్జి పిల్లలు, మరో క్షణంలోనే ఒక్కసారిగా సీన్ మారిపోయింది.
ఏనుగు ఫుల్ స్పీడులో వాటి మీదకి దూసుకొచ్చింది.

వీడియో స్టార్ట్ అయ్యేసరికి సింహం( lion ) గడ్డిలో తన పిల్లలతో ఆడుకుంటోంది.అంతలోనే ఒక పెద్ద ఏనుగు వాటి మీదకి పరిగెత్తుకుంటూ రావడం మొదలుపెట్టింది.సింహం ఒక్కసారిగా హడలిపోయింది.
వెంటనే ఒక పిల్లను నోట్లో కరుచుకుని పరిగెత్తింది.కానీ పాపం కాలు నొప్పిగా ఉండటంతో స్పీడ్ గా రన్ చేయలేకపోయింది.
చేసేదేం లేక మిగతా రెండు పిల్లల్ని అక్కడే వదిలేసి పారిపోయింది.ఇప్పుడు ఆ చిన్న పిల్లలు ఒంటరిగా, ప్రమాదంలో చిక్కుకుపోయాయి.
ఏనుగు ఆ పిల్లల దగ్గరికి వచ్చేసరికి గుండె గుభేలుమంటుంది.అసలేం జరుగుతుందో అని అందరూ టెన్షన్ పడ్డారు.
కానీ ఏనుగు వాటిని ఏం చేయకుండా ఒక్కసారిగా ఆగిపోయింది.కాసేపు వాటిని అలానే చూస్తూ ఉండిపోయింది.
ఆ తర్వాత సైలెంట్ గా వెనక్కి తిరిగి వెళ్లిపోయింది.ఈ సీన్ చూసి అందరూ అవాక్కయ్యారు.
ఏనుగు తలుచుకుంటే మిల్లీ సెకండ్లలో ఆ పిల్లల్ని చంపేసేది.కానీ జాలి చూపి ఊరుకుంది.

ఏనుగులు అంటేనే తెలివైన జంతువులు.వాటికి జ్ఞాపకశక్తి ఎక్కువ, ఎమోషన్స్ కూడా బాగా తెలుస్తాయి.అవి చాలావరకు సైలెంట్ గా, శాంతిగా ఉంటాయి.ఏ జంతువుతోనైనా ఫైట్ చేసేంత పవర్ ఉన్నా, ఎప్పుడూ గొడవలు పెట్టుకోవు.ఎవరైనా వాటిని రెచ్చగొడితే తప్ప సైలెంట్ గానే ఉంటాయి.ఏనుగు సింహం మీదకి కోపంగా వెళ్లడం అనేది చాలా అరుదు.
కానీ అంతకంటే రేర్ ఏంటంటే పిల్లల్ని వదిలేయడం, అందుకే దీన్ని ‘జాలి గుండె గజరాజు’ అంటున్నారు.సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వాళ్లంతా ఎమోషనల్ అయిపోయారు.
ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ “చిన్న పిల్లల్ని కాపాడుకోవడం జంతువులకు కూడా తెలుసు” అని రాసుకొచ్చారు.ఇంకొకరు “ఏనుగుకు ఎంత మంచి మనసు, ఎంత తెలివి.” అంటూ కామెంట్ చేశారు.సింహం కాలు నొప్పిగా ఉన్నా తన పిల్లల్ని కాపాడటానికి ట్రై చేసింది అని దాని ధైర్యాన్ని కూడా కొందరు మెచ్చుకున్నారు.
ఇంకొందరు ఫన్నీ కామెంట్లు కూడా పెట్టారు.ఒక యూజర్ అయితే “ఏనుగు కావాలని డ్రామా క్రియేట్ చేయలేదు.ఆ సింహం అమ్మకి ఒక మెసేజ్ పంపాలని అనుకుంది.” అని నవ్వుతూ కామెంట్ చేశారు.ఏదేమైనా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.







