టీడీపీని ( TDP ) ఓటమి భయం పట్టుకుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) అన్నారు.ఈ క్రమంలోనే దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు.
ఓటు వేయడానికి వచ్చిన మహిళలపై టీడీపీ క్యాడర్ దాడులకు పాల్పడుతుందని సజ్జల ఆరోపించారు.మాచర్ల, తాడిపత్రి, చిత్తూరు మరియు దర్శి నియోజకవర్గాల్లో టీడీపీ దాడులను ఈసీ( EC ) దృష్టికి తీసుకెళ్తామని సజ్జల తెలిపారు.
అయితూ వీటిని వైసీపీ శ్రేణులు పట్టించుకోవద్దన్న ఆయన పార్టీ క్యాడర్ సంయమనంతో ఉండాలని సూచించారు.అదేవిధంగా పోలింగ్ కేంద్రాల( Polling Centers ) వద్ద కొందరు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఈ మేరకు ఎన్నికల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.