తెలుగు ప్రేక్షకులకు సింగర్ సునీత( Singer Sunitha ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తెలుగులో ఉన్న టాప్ ఫిమేల్ యాంకర్స్ లో సునీత కూడా ఒకరు.
ఈమె కేవలం సింగర్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.తెలుగులో ఎన్నో పాటలు పాడి సింగర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
కాగా 19 ఏళ్ల వయసులోనే సినీ కెరియర్ ను ప్రారంభించిన సునీత సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.మొదట ఈ వేళలో నీవుఅనే పాటతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సునీత తన మధురమైన స్వరంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.సునీత పుట్టినరోజుని( Sunitha Birthday ) ఈమె అభిమానులు ఘనంగా నిర్వహించారు.ఇందులో భాగంగా సింగర్ సునీత ఫాన్స్.న్యూయార్క్ సిటీలోని టైమ్స్ స్క్వేర్( Times Square ) బిల్‌బోర్డ్‌లో సునీత వీడియోను ప్రదర్శించి ఆశ్చర్యపరిచారు.ఇప్పటి వరకు అతికొద్ది మందికే ఈ అరుదైన అవకాశం లభించగా ఇప్పుడు సునీత కూడా ఆ జాబితాలో చేరారు.

పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు సునీత ఇప్పటి వరకు పొందిన అవార్డులతో పాటు ఆమె సాధించిన పురస్కారాలతో కూడిన వీడియోను న్యూయార్క్ లోని( New York ) టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌లో ప్లే చేశారు.మే 12 తేదీన ప్రతి గంటకు 60సెకండ్ల పాటు ఈ వీడియో ప్రదర్శించడం విశేషం.ఈ విధంగా సునీత పుట్టినరోజు నాడు ఆమె అభిమానులు ఆమె జీవితంలో మరిచిపోలేని విధంగా ఒక అరుదైన గొప్ప బహుమతిని అందించారు.
అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు సునీతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.







