ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఓటమి ఎరుగని దర్శకుడు గా కొనసాగుతున్న వారిలో కొరటాల శివ కూడా ఒకరు అనే విషయం తెలిసిందే.చేసింది తక్కువ సినిమాలే అయినా తన కంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నారు కొరటాలశివ.
అంతేకాదు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతున్నారు.ఇప్పటివరకు కొరటాల శివ తన కెరియర్ లో ఐదు సినిమాలు తీశాడు.
అయితే ఈ సినిమాలో కామన్ పాయింట్ మాత్రం ఒకటి ఉంటుంది.కేవలం కథణం మాత్రమే మారుస్తూ కథ కాస్త అటూ ఇటూ ఒకేలాగ ఉంటుంది అని అటు అభిమానులు అనుకునే మాట.
ఇంతకీ కొరటాల శివ సినిమాల్లో ఫ్యాక్టరీ ఏంటి అని అనుకుంటున్నారు కదా.అది ఏంటో వివరాల్లోకి వెళ్తే చూద్దాం.కొరటాల శివ సినిమాలో హీరో ఎవరు అనేది ముందుగా అసలు బయటపెట్టడు.ఇక ఆ తర్వాత అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుస్తుంది.భాష, నరసింహనాయుడు, ఇంద్ర సినిమాలో కూడా ఇదే స్టైల్ ఉంటాయి అని చెప్పాలి.ఐడెంటిటీ బయటపడిన తర్వాత ఊరు వెళ్లి అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించడం అక్కడ ఉన్న ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉంటాడు హీరో.
ఇక ఆ తర్వాత జనం కోసం పోరాడిన ఒక మంచి వ్యక్తిగా హీరోకి ఓ ఇమేజ్ పెరిగి పోతూ ఉంటుంది.కొరటాల శివ ఏ సినిమాలో చూసినా ఇలాంటి కామన్ ఫ్యాక్టర్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది.
ఇక ఇప్పుడు ఆచార్య సినిమాలో కూడా ఇలాంటిదే రిపీట్ అయ్యింది అని తెలుస్తోంది.

మిర్చి సినిమా చూసుకుంటే ప్రభాస్ ఎక్కడో విదేశాల్లో ఉంటాడు.కానీ ఒక సారి గతంలోకి వెళితే ఒక ఫ్యాక్షనిస్టు ఫ్యామిలీకి చెందిన వ్యక్తి.శ్రీమంతుడులో ఒక సాదాసీదా ఫ్యామిలీ లో ఉన్న వ్యక్తి కానీ బ్యాక్ గ్రౌండ్ చూసుకుంటే ఊరికి మంచి చేయాలి అనుకునే వ్యక్తి కొడుకు.
ఇక జనతా గ్యారేజ్ లో కూడా అతని కుటుంబం ఒక గొప్ప సంకల్పం ఉన్నవాళ్లు అన్నది బయట పెడతాడు.

భరత్ అనే నేను కాస్త డిఫరెంట్ గా అనిపిస్తుంది అనుకోండి.ఇలా ప్రతి సినిమాలో కూడా హీరో ఎవరు ముందు బయట పెట్టకుండా తర్వాత ఐడెంటిటీ బయటపెట్టి ఇక సామాజిక సమస్యలు ఊరి సమస్యలు తీర్చడం లాంటివి చేస్తూ ఉంటారు.అయితే కొరటాల శివ ఎలా సినిమాలు తీసిన ప్రేక్షకులను మాత్రం కన్విన్స్ చేసి మంచి విషయాలు అందుకుంటున్నాడు అని చెప్పాలి.







