కేంద్రం కీలక నిర్ణయం.. జ్వరం వస్తే ఆ రెండు పరీక్షలు..?

భారతదేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న సంగతి తెలిసిందే.మార్చి నెల తొలి వారం నుంచి వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది.

 Dengue And Corona Tests Are Mandatory For Fever, Dengue, Corona Tests, Fever, Co-TeluguStop.com

గత కొన్ని వారాల నుంచి పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గినా మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు, వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఒకవైపు కరోనా ఉధృతి కొనసాగుతుంటే మరోవైపు సీజనల్ వ్యాధులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.

కరోనా లక్షణాలు, సీజనల్ వ్యాధుల లక్షణాలు దాదాపుగా ఒకే విధంగా ఉండటం గమనార్హం.
కరోనాతో పాటు మరో ప్రాణాంతక వ్యాధి డెంగ్యూ కూడా ప్రజలను టెన్షన్ పెడుతోంది.

కొందరు ఈ వ్యాధుల బారిన పడినా లక్షణాలు కనిపించకపోవడం శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతోంది.దీంతో కేంద్ర ఆరోగ్య సంక్షేమ కుటుంబ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.జ్వరం వస్తే వెంటనే కరోనా పరీక్షలతో పాటు డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలని.పరీక్షలు నిర్వహించడంలో ఆలస్యం చేస్తే ప్రాణాలకే అపాయం కలిగే అవకాశం ఉందని తెలిపింది.
కొందరు రోగులు ఒకే సమయంలో కరోనాతో పాటు డెంగ్యూ బారిన పడుతున్న నేపథ్యంలో లక్షణాలకు అనుగుణంగా చికిత్స అందించడంతో పాటు మందులు వాడే విషయంలో జాగ్రత్త వహించాలని సూచనలు చేసింది.హెపారిన్ మందు రెండు వ్యాదుల బారిన పడ్డవాళ్లకు ఇస్తే ప్రమాదమని ఈ విషయం గుర్తుంచుకోవాలని తెలిపింది.

ఎవరికైనా రెండు వ్యాదులు నిర్ధారణ అయితే ఆస్పత్రిలోనే వైద్య చికిత్స తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

కరోనా, డెంగ్యూ నిర్ధారణ అయితే ఆక్సీమీటర్ సహాయంతో తరచూ ఆక్సిజన్ లెవెల్స్ ను తెలుసుకోవాలని.

వ్యాదుల బారిన పడకుండా ప్రజలు ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవడంతో పాటు కరోనా వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube