రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఇప్పుడు ఐఏఎస్.. ఇతని సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!

కాలం ఎంత మారుతున్నా, టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా సమాజంలో కొంతమంది పేద కుటుంబాలకు చెందిన వాళ్లను చిన్నచూపు చూస్తున్న ఘటనలు అడపాదడపా చోటు చేసుకుంటున్నాయి.గోవింద్ జైస్వాల్( Govind Jaiswal ) చిన్నప్పుడు స్నేహితుడితో కలిసి స్నేహితుని ఇంటికి వెళ్లగా అతని తల్లీదండ్రులు చిన్నచూపు చూడటంతో పాటు తమ కొడుకుతో కలిసి కనిపించవద్దని హెచ్చరించారు.

 Govind Jaiswal Success Story Inspiration To Others Details Here Goes Viral In So-TeluguStop.com

గోవింద్ జైస్వాల్ తండ్రి రిక్షావాలా ( rickshawala )కావడంతో వాళ్లు ఈ విధంగా చేశారు.అయితే ఈ ఘటన గోవింద్ జైస్వాల్ మనసులో నాటుకుపోయింది.తనను ఎవరైతే చిన్నచూపు చూశారో వాళ్లే గౌరవించేలా ఉన్నత స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న గోవింద్ జైస్వాల్ చిన్నప్పటి నుంచి చదువును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదిగారు.రేయింబవళ్లు శ్రమించిన గోవింద్ జైస్వాల్ ప్రస్తుతం ఐఏఎస్ ( IAS )గా సేవలందిస్తున్నారు.

రిక్షావాలా కొడుకు ఐఏఎస్ గా విజయం సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.ముళ్లబాటను పూలబాటగా మార్చుకున్న గోవింద్ జైస్వాల్ తన సక్సెస్ తో ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.గోవింద్ జైస్వాల్ సక్సెస్ వెనుక తండ్రి నారాయణ జైస్వాల్ ( Narayana Jaiswal )కష్టం ఉంది.కొడుకుకు ఎలాంటి కష్టం రాకుండా నారాయణ జైస్వాల్ రిక్షా తొక్కి కొడుకును చదివించాడు.

ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కొడుకు చదువు విషయంలో ఇబ్బందులు కలిగించలేదు.

ఢిల్లీలో కోచింగ్ తీసుకున్న గోవింద్ జైస్వాల్ ఆ సమయంలో ఖర్చుల కోసం చిన్నచిన్న పనులు కూడా చేశారు.2006 సంవత్సరంలో జాతీయ స్థాయిలో 48వ ర్యాంక్ సాధించిన గోవింద్ జైస్వాల్ తన సక్సెస్ తో విమర్శలు చేసిన వాళ్ల నోరు మూయించారు.ప్రస్తుతం గోవింద్ జైస్వాల్ గోవాలో విధులు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.

స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఆయన పని చేస్తున్నారని సమాచారం అందుతోంది.గోవింద్ జైస్వాల్ సక్సెస్ స్టోరీ గురించి తెలిసి నెటిజన్లు అతని కష్టానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

Govind Jaiswal Success Story

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube