ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ గా సూపర్ ఫాం లో ఉన్న థమన్ చాలావరకు తన మ్యూజిక్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నా కొన్ని సినిమాల వల్ల నెగిటివ్ ట్రోల్స్ అందుకుంటున్నాడు.ఇక మహేష్ 28వ సినిమా విషయంలో ముందునుంచి థమన్ ఎందుకో డిస్టర్బ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది.
మహేష్ సినిమా నుంచి థమన్ ని తప్పించాలని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు.దానికి థమన్ బాగా అప్సెట్ అయ్యాడు.
ఇదిలాఉంటే మహేష్ సినిమా పాటల విషయంలో కూడా థమన్ తడపడుతున్నట్టు తెలుస్తుంది.త్రివిక్రం ని సాటిస్ఫై చేసే విషయంలో థమన్ కంగారు పడుతున్నాడట.

ఇప్పటివరకు ఎస్.ఎస్.ఎం.బి 28 కోసం చేసిన కొన్ని కంపోజింగ్స్ ని త్రివిక్రం అన్ సాటిస్ఫైడ్ గా ఉన్నట్టు టాక్.మరి థమన్ ఎందుకు అలా చేస్తున్నాడు అన్నది తెలియాల్సి ఉంది.త్రివిక్రం తో అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలకు పనిచేసిన థమన్ మహేష్ సినిమాకు 100 శాతం ఇవ్వలేకపోతున్నాడని టాక్.
మరి త్రివిక్రం థమన్ నుంచి తను అనుకున్న విధంగా మ్యూజిక్ రాబట్టుకోగలుగుతాడా లేదా అన్నది సినిమా వచ్చాక తెలుస్తుంది.







