వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత యనమల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.వ్యవస్థలపై వైసీపీ సర్కార్ కు గౌరవం లేదని విమర్శించారు.
ఏపీ రాజధానిపై ఒక్కో మంత్రి ఒక్కోలా మాట్లాడుతున్నారని యనమల మండిపడ్డారు.రాష్ట్ర అప్పులు, అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేసి బహిరంగ చర్చకు రావాలని పిలిచినా స్పందన లేదని విమర్శించారు.
కార్పొరేషన్ అప్పులతో ప్రభుత్వానికి సంబంధం లేదనడం సరికాదన్నారు.ఎఫ్ఆర్ బీఎం చట్టానికి సవరణ చేసి 90 శాతం లిమిట్ ఉన్న గ్యారెంటీలను 180 శాతానికి ఎందుకు పెంచారని ప్రశ్నించారు.
ఈ నాలుగేళ్ల పాలనలో వేస్ అండ్ మీన్స్ ద్వారా ఎన్ని కోట్లు తెచ్చారని నిలదీశారు.అదేవిధంగా ఏపీ రెవెన్యూ లోటు రూ.40 వేల కోట్లకు ఎందుకు పెరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు.







