ఘోరం: ప్రపంచ ప్రఖ్యాత గొరిల్లా హత్య,ఉగాండా లో...

ఉగాండా లో ఘోర ఘటన చోటుచేసుకుంది.ప్రపంచ ప్రఖ్యాత సిల్వర్ బ్యాక్ గొరిల్లా దారుణ హత్యకు గురైంది.

 Rafiki, Uganda's Rare Silverback ,gorilla,uganda,national Park-TeluguStop.com

బ్విండి ఇంపినిట్రేబుల్‌ నేషనల్‌ పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది.నలుగురు నేరగాళ్లు ఆ గొరిల్లా ను దారుణంగా హతమార్చినట్లు అధికారులు గుర్తించారు.

ఈ కేసుకు సంబంధించి వారిని అరెస్ట్ చేసిన అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది.కాగా అంతరించి పోతున్న అరుదైన గొరిల్లా జాతిలో సిల్వర్ బ్యాగ్ గోరిల్లా ఒకటి.

వీటిలో రఫికి అనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొరిల్లాను ఇంపినిట్రేబుల్‌ నేషనల్ పార్క్ ‌‌లో ఉంచారు.

25ఏళ్ల ఈ మగ గొరిల్లా ఆ పార్క్ లోనే ఉంటోంది.

అయితే ఇటీవల ఆ గొరిల్లాను నలుగురు వేటగాళ్లు చంపేసినట్లు తెలుస్తుంది.దీంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా, అసలు విషయం తెలిపారు.

తమ ప్రాణ రక్షణ కోసమే ఆ గొరిల్లా ను చంపినట్టు నిందితులు వెల్లడించినట్లు తెలుస్తుంది.అయితే అసలుకే అంతరించిపోతున్న జాతికి చెందిన జంతువు అయిన ఈ గొరిల్లా ను హత్య చేయడం తో వారికి జీవిత ఖైదు విధించే అవకాశాలు ఉన్నట్లు న్యాయనిపుణులు భావిస్తున్నారు.

అరుదైన గొరిల్లా జాతిలో ఈ గొరిల్లా ఒకటి కావడం తో ఆ నిందితులకు శిక్ష కఠినంగా ఉండే అవకాశం కనిపిస్తుంది.మరి దీనిపై ఉగాండా న్యాయస్థానాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.

అయితే ప్రాణ భయం తో ఇలా నోరు లేని మూగ జీవాన్ని పార్క్ లోనే హత్య చేయడం కలకలం సృష్టించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube