సర్పవరం SI గోపాలకృష్ణ ఆత్మహత్యపై స్పందించిన కాకినాడ SDPO భీమారావు.ఎస్సై ఆత్మహత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం.
SP గారు ఇప్పటికే నేర స్థలాన్ని సందర్శించి పరిశీలించి వివరాలు తెలుసుకొని తగిన సూచనలు ఇచ్చి వెళ్లారు.ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
SI గారి భార్య పావని గారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.కొన్ని టీవీ ఛానల్ లలో సదరు SI కు పోస్టింగ్ ఇవ్వకుండా వేధించారని, అధికారుల వేధింపుల వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారు.ఎస్సై గోపాలకృష్ణ ది:26.08.2021 నుండి ఈరోజు వరకు సర్పవరం పోలీస్ స్టేషన్లో SI గా విధులు నిర్వహిస్తున్నారు.అవాస్తవ వార్తలు ప్రసారం చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్టకు భంగం కలిగిస్తే చట్టప్రకారం చర్యలకు ఉపక్రమిస్తాం.
సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్య విషయం కొన్ని టీవీ ఛానల్ లలో “పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్న పోలీసు అధికారులు, ఎస్ఐ మాట్లాడిన సెల్ఫీ వీడియో హల్ చల్” అని ప్రసారం చేయడం జరుగుతుందని, ఈ విషయంపై కాకినాడ SDPO భీమారావు గారు మాట్లాడుతూ గోపాల్ కృష్ణ గారు 2014 బ్యాచ్ SI గా సెలెక్ట్ అవ్వడం జరిగిందని, అప్పటినుండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డొంకరాయి, సర్పవరం, రాజోల్, కాకినాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లలో పనిచేసి ప్రస్తుతం సర్పవరం పోలీస్ స్టేషన్ నందు ది.26.08.2021 నుండి విధి నిర్వహణ చేస్తున్నారని, అతని ఆత్మహత్యకు సంబంధించి విచారణ చేపట్టాము.

ప్రాధమిక విచారణలో SI గోపాలకృష్ణ MCA పూర్తీ చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ SI ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారని, మొదటి నుంచి తన తోటి SI లతో తనకు సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటేనే ఇష్టమని, అనవసరంగా ఆ ఉద్యోగం వదిలి SI ఉద్యోగానికి వచ్చానని బాధపడుతూ ఉండేవాడని తెలిసింది.పూర్తి స్థాయి విచారణ అనంతరం వివరాలు వెల్లడించడం జరుగుతుందని, ఎవరైనా ఎస్.ఐ.గారి ఆత్మ హత్య విషయం గురించి అవాస్తవాలు, పుకార్లను ప్రసారం చేసి పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది.







