టిఆర్ఎస్ తక్కువ అంచనా వేయకూడదు.గెలుపు కోసం ఎంతవరకైనా తెగిస్తుంది అనే విషయం ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన హుజురాబాద్ అభ్యర్థి ఈటెల రాజేందర్ కి బాగా తెలుసు.
టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కీలక నేతగా ఉండడంతో పాటు, కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా మెలగడంతో కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఏ విధంగా ఉంటాయి అనేది రాజేందర్ కు బాగా తెలుసు.ఇప్పుడు ఆ వ్యూహాలను తలుచుకునే రాజేందర్ భయపడుతున్నట్లు గా కనిపిస్తున్నారు.
ఇంకా హుజురాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేందుకు చాలా సమయమే ఉంది.అప్పటిలోగా టిఆర్ఎస్ ఈ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ఎంతవరకైన తెగిస్తుంది ఎన్ని కోట్లు అయినా కుమ్మరిస్తుంది అనే విషయం రాజేందర్ కు బాగా తెలుసు.

అదీ కాకుండా తనకు అత్యంత సన్నిహితులైన వారు, ఎన్నికల సమయంలో తనకు కలిసి వస్తారు అనుకున్న నాయకులందరినీ గుర్తించి మరీ టిఆర్ఎస్ కండువా కప్పుతున్న తీరు రాజేందర్ లో ఎక్కడలేని భయాందోళనలు పుట్టిస్తున్నాయి.వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా, ఈ ఉప ఎన్నికలు మాత్రం రాజేందర్ లో దడ పుట్టిస్తున్నాయి.దీనికి తోడు హుజూరాబాద్ నియోజకవర్గం లో బిజెపి కి పెద్దగా బలం లేకపోవడం, కేవలం తన వ్యక్తిగత ఇమేజ్ ద్వారానే గెలవాల్సిన పరిస్థితి ఉండడం ఇవన్నీ రాజేందర్ కు ఇబ్బందికరంగానే మారాయి.

టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ గా పేరుపడ్డ టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు కు ఈ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం, ఆయన పూర్తిగా బిజెపి , తటస్థ వ్యక్తులను టార్గెట్ చేసుకుంటూ టిఆర్ఎస్ లో చేర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, ఈ నియోజకవర్గంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టడం, టిఆర్ఎస్ అగ్ర నాయకులు అంతా ఈ నియోజకవర్గంలో పర్యటిస్తూ, తనకు అవకాశం లేకుండా చేస్తుండడం ఇలా ఎన్నో అంశాలు రాజేందర్ భయానికి కారణాలు గా మారాయట.వీలైనంత తొందరగా ఎన్నికలు జరిగితే పరిస్థితి తనకు అనుకూలంగా ఉంటుంది అని, ఎన్నికల సమయం మరీ ఎక్కువగా ఉంటే తనకు ఇబ్బందే అనేది రాజేందర్ అభిప్రాయమట.