తలుచుకుంటే సీఎం : ' గాలి ' మాటలు సంచలనం !

మైనింగ్ డాన్ పేరుపొందిన కర్ణాటక బిజెపి నాయకుడు గాలి రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు.వేలకోట్ల ఆస్తులకు అధిపతి.

 Gali Janardan Reddy Sensational Comments Gali Janardhan Reddy , Maining , Bjp, K-TeluguStop.com

ఏపీ కర్ణాటకలోనూ మైనింగ్ వ్యాపారాలను విస్తరించి కోట్లకు పడగలెత్తుతారు.అంతేకాదు కర్ణాటకలో బిజెపి నేతగా ఉన్న ఆయన అక్కడ రాజకీయాలను శాసిస్తూనే ఉంటారు.

గతంలో అనేక కీలక పదవులను చేపట్టిన ఆయన ప్రస్తుతం బీజేపీ నాయకుడిగానే కొనసాగుతున్నారు.ఇదిలా ఉంటే తాజాగా గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు పుట్టినరోజు వేడుకలు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.” నేను తలుచుకోవాలే కానీ, సీఎం అయిపోతా.కానీ తల్చుకోను.అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.అయితే ఆయన ఉద్దేశపూర్వకంగా చేశారా నిజంగానే సీఎం అవ్వాలనుకుంటున్నారా లేక తన కెపాసిటీ ఏంటో చాటి చెప్పేందుకే ఈ విధమైన వ్యాఖ్యలు చేసారో అర్థం కాలేదు.

కానీ కర్ణాటక లోనే అత్యంత ధనవంతుడిగా పేరుపొందిన గాలి జనార్దన్ రెడ్డికి బిజెపి అగ్ర నాయకులతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఆయన తలుచుకుంటే నిజంగానే ముఖ్యమంత్రి పదవిని దక్కించుకునే రేంజ్ లో ఆయన ఉన్నారు.

అయితే ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు తీసుకువచ్చారు అనేది చర్చనీయాంశంగా మారింది.గాలి జనార్ధనరెడ్డి మైనింగ్ అక్రమాలపై కేసులు నమోదు చేయడం తదితర కారణాలతో చాలా కాలంగా బళ్లారి కి దూరంగా ఉన్నారు .అయితే ఆ తరువాత బళ్ళారి లో ఉండేందుకు సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆయన అక్కడే మకాం వేసి రాజకీయాలు చేస్తున్నారు.గాలి జనార్దన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రధాన అనుచరుడు శ్రీరాములు తో పాటు, గాలి సోదరులు బిజెపి లోనే ఉన్నారు.

బిజెపి కి కావాల్సిన అన్ని సహాయాలను గాలి జనార్దన్ రెడ్డి చేస్తూనే ఉన్నారు.

Telugu Galijanardan, Galijanardhan, Karnataka Bjp, Modhi-Politics

మైనింగ్ కేసులూ ఆయన పై ఉన్న కారణంగా బిజెపి ఆయనను ఎన్నికల బరిలో దింపేందుకు ఇష్టపడడం లేదు.అయినా తాను తలుచుకుంటే సీఎం అవగలను అన్న ధీమా ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తం చేస్తుండటంతో ఈ మేరకు బీజేపీ అధిష్టానం పెద్దల పై ముఖ్యమంత్రి పదవి విషయంలో ఒత్తిడి చేస్తున్నారా అనే అనుమానం అందరిలోనూ తలెత్తుతోంది.ముందు ముందు కర్ణాటక రాజకీయాల్లో గాలి జనార్దన్ రెడ్డి రచ్చ జరగబోతోందనే సంకేతాలు ఆయన వ్యాఖ్యలను బట్టి అర్ధం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube