అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswara Rao ) ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు.వాటిలో ఒకటి ధర్మదాత( Dharma Daata ).
1970లో విడుదలైన ఈ డ్రామా ఫిలిం ని తమ్మారెడ్డి కృష్ణ మూర్తి నిర్మించగా, ఎ.సంజీవి దర్శకత్వం వహించాడు.ఇందులో ఏఎన్నార్ సరసన కాంచన నటించారు, T.చలపతి రావు మ్యూజిక్ కంపోజ్ చేశాడు.ఎంగ ఊర్ రాజా (1968)కి అనే తమిళ సినిమాకి రీమేక్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.ఒరిజినల్ సినిమాలో శివాజీ గణేషన్( Sivaji Ganesan ) హీరోగా చేశాడు.
ధర్మదాతలో ఎవ్వడి కోసం ఎవడున్నాడు… పొండిరా పొండి… అనే పాట బాగా హిట్ అయింది.ఈ పాట లిరిక్స్‌కు ఎవ్వరి కోసం ఎవరూ ఉండరు.కాలం ఖర్మం కలిసొస్తేనే అందరి సాయం లభిస్తుంది.ఉన్నవాడిదే రాజ్యం, లేనివాడి పని పూజ్యం.
మనుషులలో మమతలు లేవు, మంచితనానికి రోజులు కావు అనే అర్థం వస్తుంది.ఇది ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.‘ధర్మదాత’ సినిమాలో పట్టుదలతో పోగొట్టుకున్న రాజ్‌మహల్‌ను తిరిగి దక్కించుకునేందుకు ఓ ధర్మదాత పడే ఆరాటం, ముసలి పౌరుషం ఈ పాట ద్వారా తెలియజేశారు.

ఎవరికివారు ఇష్టం వచ్చినట్లు వెళ్లిపోయిన పిల్లలను ఉద్దేశించి ధర్మదాత ఈ పాట ఆలపిస్తాడు.ఈ పాటలో ఏఎన్నార్( ANR ) నటన అద్భుతంగా ఉంటుంది.ఈ పాట బాగా హిట్టయింది.
ఈ పాట కోసం ఏఎన్నార్ రెండు రోజులుగా భోజనం చేయలేదట.బాధ, ఆకలి తన ముఖంలో కనపడాలనే ఉద్దేశంతో అతడు అలా చేశాడు.
సినిమాలో దారితప్పిన కొడుకులు తిరిగి దారిలోకి వచ్చినట్లు చూపించారు కానీ నిజ జీవితంలోనూ అలానే జరుగుతుందని అనుకుంటే పొరపాటే.ఈ రోజుల్లో పిల్లలు స్వార్థపూరితమైన ఆలోచనలతో తల్లిదండ్రులను అస్సలు పట్టించుకోవడం లేదు.
తల్లిదండ్రుల ఆశయాలను, పరువు ప్రతిష్టలను పట్టించుకునే పిల్లల సంఖ్య వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు అంటే అతిశయోక్తి కాదు.తల్లిదండ్రులకు తెలియకుండానే వారిని తాకట్టు పెట్టే కొడుకులు, కుమార్తెలు కూడా ఉన్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ఆలోచింపచేసే మంచి ఎమోషనల్ కథ( Emotional Story )తో వచ్చిన ధర్మదాత 11 కేంద్రాలలో 100 డేస్ ఆడి రికార్డు సృష్టించింది.హైదరాబాద్ శాంతి థియేటర్‌లో 100 డేస్ ఫంక్షన్ కూడా ఘనంగా నిర్వహించారు.ఏఎన్ఆర్ ఇందులో డ్యూయల్ రోల్ చేశాడు.నాగేశ్వరరావు ముసలివాడిగా కనిపిస్తూ పౌరుషాన్ని, పట్టుదలను, ఆత్మాభిమానాన్ని భలే చక్కగా హావభావాల్లో చూపించగలిగాడు.అలాగే సంపద కోల్పోయాక ఒక ధనికుడు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటాడో తన నటనతో అద్భుతంగా చూపించాడు.ఇక యంగ్ వెర్షన్‌లో కూడా అద్భుతంగా నటించి వావ్ అనిపించాడు.
జానకి, నాగభూషణం, పద్మనాభం, రేలంగి తదితర దిగ్గజాలు కూడా ఇందులో నటించిన మెప్పించారు.టి చలపతిరావు కంపోజ్ చేసిన జో లాలీ జో లాలి లాలీ నా చిట్టితల్లి , చిన్నారీ బుల్లెమ్మ సిగ్గెందుకులేవమ్మా , హల్లో ఇంజనియర్ వంటి పాటలు మనసును హత్తుకునేలా ఉంటాయి.
ఈ మంచి సినిమా చూడాలనుకునేవారు యూట్యూబ్‌లో దీని కోసం సెర్చ్ చేయవచ్చు.