పెళ్ళాం ఊరెళితే, ఒట్టేసి చెబుతున్నా, ఖడ్గం, మాయాజాలం, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది వంటి ఎన్నో ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు మేక శ్రీకాంత్( Meka Srikanth ).ఈ హ్యాండ్సమ్ హీరో ఆపరేషన్ దుర్యోధన వంటి వెరైటీ సినిమాలు కూడా చేశాడు.1991 నుంచి ఇప్పటికీ సినిమాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్నాడీ నటుడు.త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ “దేవర”, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “గేమ్ చేంజర్” సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నాడు.
ఈ నేపథ్యంలోనే అతను ఒక ఇంటర్వ్యూకు హాజరయ్యి తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్లు ఎవరో వెల్లడించాడు.
ఒక ఇంటర్వ్యూలో శ్రీకాంత్‌ను “మీకు ఏ డైరెక్టర్ అంటే ఇష్టం?” అని ఓ ప్రశ్న అడిగారు.దానికి బదులు ఇస్తూ “అందరూ ఇష్టమేనని” ఈ ప్రశ్న దాటవేయడానికి శ్రీకాంత్ ప్రయత్నించాడు.అయితే శ్రీకాంత్ ను ఇంటర్వ్యూ చేసే కమెడియన్ అలీ ఇష్టమైన డైరెక్టర్ పేరు చెప్పాల్సిందే అని పట్టుబట్టాడు.
దాంతో శ్రీకాంత్ తనకు లైఫ్ ఇచ్చిన, బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన, మూవీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుల పేర్లు చెప్పాడు.

“తమ్మారెడ్డి భరద్వాజ్( Tammareddy Bharadwaj ) నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు.ఈవీవీ సత్యనారాయణతో ( EVV Satyanarayana )నా కెరీర్ మొత్తం స్టార్ట్ అయింది.తర్వాత కృష్ణారెడ్డి ( Krishna Reddy )తో కలిసి సినిమాలు తీశా.
రాఘవేంద్ర రావు నాకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు.ఒక ఫ్యామిలీ హీరో నుంచి ఎమోషనల్ హీరోగా కృష్ణవంశీ ( Krishna vamsi )నన్ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు.” అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.

శ్రీకాంత్ రాఘవేంద్రరావుతో కలిసి “పెళ్లి సందడి” సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.ఎస్వీ కృష్ణారెడ్డి తో కలిసి “వినోదం” సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ మూవీలో కామెడీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు.
తర్వాత ఎస్ వి కృష్ణారెడ్డి తో కలిసి “ఆహ్వానం” మూవీ చేశాడు.ఇవివి సత్యనారాయణతో కలిసి “తిరుమల తిరుపతి వెంకటేశ” లాంటి కామెడీ సినిమాలు కూడా శ్రీకాంత్ చేశాడు.
రీసెంట్ గా అతడు రామ్ పోతినేని నటించిన “స్కంద” సినిమాలో రుద్రకంటి రామకృష్ణరాజు గా వేషం వేసి మెప్పించాడు.సుధీర్ బాబు హీరోగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ “హంట్” లో కూడా ఓ కీ రోల్ పోషించాడు.