టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రకు ఆశించి స్థాయిలోనే స్పందన వస్తుండడంతో, మరింత ఉత్సాహంగా లోకేష్ తన యాత్రలో ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతున్నారు.స్థానికంగా నెలకొన్న సమస్యలతో పాటు, గత టిడిపి ప్రభుత్వం( TDP )లో చోటు చేసుకున్న అభివృద్ధి, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అభివృద్ధికి మధ్య తేడాను వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ విషయంలో వైసిపి నాయకులకు సవాల్ విసురుతూ, అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ లోకేష్ ప్రశ్నిస్తున్నారు.ముఖ్యంగా వైసీపీకి గట్టి పట్టున్న రాయలసీమ ప్రాంతాన్ని టిడిపికి కంచుకోటగా మార్చేందుకు లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే మిషన్ రాయలసీమను ప్రకటించిన లోకేష్ ( Nara lokesh )రాబోయే రోజుల్లో రాయలసీమను ఏవిధంగా అభివృద్ధి చేయబోతున్నామనే విషయాన్ని ప్రకటించారు.

ఇక తాజాగా రాయలసీమ ఎమ్మెల్యేలు, ఎంపీలకు లోకేష్ ఛాలెంజ్ విసిరారు.రాయలసీమలో ఉన్న 49 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు మొత్తం 57 మంది కలిసి తనతో చర్చ కు రావాలని, రాయలసీమ ఎవరి హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందో చర్చిద్దాం అని , టిడిపి తరఫున తాను ఒక్కడినే వస్తానని , చర్చ కు నేను సిద్ధమని, మీరు సిద్దమా అంటూ లోకేష్ సవాల్ చేశారు.

రాయలసీమకు మీరేం చేస్తారో చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.ఇచ్చిన హామీలపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ముందు సెల్ఫీలు దిగిన లోకేష్ , ఆ సెల్ఫీలతోనే వైసిపి ఎమ్మెల్యేలు , ఎంపీలకు ఛాలెంజ్ విసిరారు.ఇప్పటి వరకు రాయలసీమకు ఏం చేసామో చూపించానని, మీరు చేసింది ఏమిటో చెప్పే దమ్ము ఉందా అని లోకేష్ ప్రశ్నించారు.
ఈ విధంగా లోకేష్ తన యువ గళం పాదయాత్రలో వైసిపి ప్రజా ప్రతినిధులకు సవాళ్లు విసురుతూ స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రస్తావిస్తూ తన యువకులను పాదయాత్రకు మరింత ఆదరణ పెరిగే విధంగా చేసుకుంటూ, క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు.గతంతో పోలిస్తే లోకేష్ ప్రసంగాల్లోనూ దూకుడు కనిపిస్తుండడం వంటివి టిడిపికి మరింతగా కలిసి వస్తున్నాయి.