ఉసిరికాయలు.వీటి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.
పులుపు, వగరు రుచులను కలగలసి ఉండే ఉసిరికాయల్లో బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి.అవి మన ఆరోగ్యానికే కాకుండా కురుల సంరక్షణకు సైతం ఎంతగానో సహాయపడతాయి.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా ఆమ్లా ఆయిల్ ను తయారు చేసుకుని వాడితే హెయిర్ ఫాల్ తో సహా ఎన్నో జుట్టు సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆమ్లా ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలి అన్నది తెలుసుకుందాం పదండి.
ముందుగా పది ఉసిరికాయలను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి గింజ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ కొబ్బరి నూనె మరియు ఆమ్లా జ్యూస్ వేసుకుని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ ఆమ్లా ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
ఈ ఆయిల్ ను నైట్ నిద్రించే ముందు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి.
వారంలో రెండుసార్లు ఈ ఆమ్లా ఆయిల్ ను వాడితే జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి.తద్వారా జుట్టు రాలడం, విరగడం, చిట్లడం వంటివి తగ్గుముఖం పడతాయి.
అదే సమయంలో జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.చుండ్రు సమస్య ఉంటే దూరం అవుతుంది.
మరియు ఈ ఆమ్లా ఆయిల్ ను వాడటం వల్ల తెల్ల జుట్టు సమస్య సైతం త్వరగా రాకుండా ఉంటుంది.