ఈ చెట్టు ఒకటి ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలే ఉండవు..!

బిల్వ పత్రం లేదా ఆ చెట్టు ఆకులను పూజించడం యొక్క ప్రాముఖ్యత శివపురాణం లో ఉంది.దీన్ని మానవులే కాకుండా దేవతలు సైతం పూజిస్తారు.

 If You Have One Of These Trees At Home, There Will Be No Financial Problems..!-TeluguStop.com

ముఖ్యంగా మూడు బిల్వ చెట్టు( Aegle marmelos ) పేడులను శివునికి సమర్పిస్తే మహా శివుని అనుగ్రహం లభిస్తుందని ప్రజలు నమ్ముతారు.ఈ చెట్టు యొక్క కొమ్మల కింద స్నానం చేస్తే విశ్వంలోని అన్ని పవిత్ర జలాలు పుణ్యనదుల్లో స్నానం చేసిన దానితో సమానమని ఈ పండితులు చెబుతున్నారు.

అంతేకాకుండా బిల్వపత్రం మనిషి జీవితంలోని కీడును, దోషాలను తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

మన ఇంటి ఆవరణలో బిల్వ వృక్షం లేదా మొక్క ఉంటే ఎంతో మేలు చేస్తుందో చాలామందికి తెలియకపోవచ్చు.

ఈ బిల్వపత్రమే కాకుండా పండు కూడా చాలా మేలు చేస్తుంది.అలాగే జ్యోతిష్యం ప్రకారం ఏం ఫలితం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.హిందువుల విశ్వాసం ప్రకారం బిల్వ పత్ర చెట్టులో లక్ష్మీదేవి( Goddess Lakshmi ) నివసిస్తుంది.కాబట్టి ఈ చెట్టును పూజించడం వల్ల ఆర్థికపరమైన చికాకులు దూరమవుతాయని పండితులు చెబుతున్నారు.

Telugu Aegle Marmelos, Devotional, Goddess Lakshmi, Lord Shiva, Parvati, Vastu,

ముఖ్యంగా ఎక్కువగా బిల్వ పత్రాలను ఇంటి దగ్గర నాటితే ఐశ్వర్యం పెరుగుతుంది.ఈ బిల్వపత్రన్ని శివుడికి నైవేద్యంగా పెడితే పాపాలు దూరం అయిపోతాయి.అలాగే ఈ చెట్టును పూజిస్తే లేదా ఇంటిదగ్గర నాటుకుంటే కూడా మన పాపాలు తగ్గిపోతాయి.అలాగే దీన్ని ప్రతిరోజు పూజించడం ఎంతో మంచిది.ఈ బిల్వ పత్ర వృక్షానికి నెయ్యి, ఆహారం, పాయసం లేదా స్వీట్లు సమర్పించడం ద్వారా ఆర్థిక సమస్యలు దూరమవుతాయని ప్రజలు నమ్ముతారు.బిల్వ పత్ర జలాన్ని నుదుటిపై పోసుకుంటే సకల తీర్థయాత్రల పుణ్యఫలితం లభిస్తుంది.

Telugu Aegle Marmelos, Devotional, Goddess Lakshmi, Lord Shiva, Parvati, Vastu,

అలాగే సోమవారం రోజు బిల్వపత్రలను తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు.ఇలా చేస్తే జీవితంలో చాలా రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.బిల్వపత్రంలో శివుడు మరియు పార్వతి నివసిస్తారని ప్రజలు నమ్ముతారు.కాబట్టి బిల్వ నైవేద్యాన్ని సమర్పించి శివపార్వతి( Parvati )ని పూజించిన వారికి శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube