ఎదిగిన కొద్ది ఒదిగి ఉండటంలోనే మనిషి గొప్పతనం ఉంటుంది.జీవితంలో ఎంతో ఉన్నత స్థానాలకు వెళ్లినా గర్వం అనేది పనికి రాదు.
ప్రతి మనిషిని ప్రేమగా చూసినప్పుడు, గౌరవంగా పలకరించినప్పుడే ఆయా వ్యక్తుల కీర్తి మరింత పెరుగుతుంది.అందరితో కలిసిపోయే వారే మంచి వారిగా గుర్తింపు పొందుతారు.
ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే.టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి చెప్పడానికి ఈ మాత్రం చెప్పక తప్పదు.
ధోనీ స్టేడియంలోనే కాదు.బయట కూడా చాలా కూల్ గా ఉంటాడు.తాను ఓ పెద్ద క్రికెటర్‌ను అనే దర్పం ఎక్కడా ప్రదర్శించడు.ఎవరితోనైనా ఈజీగా కలిసి పోతాడు.
ప్రేమగా మాట్లాడుతాడు.ఈ రెండు విషయాల గురించి తెలుసుకుంటే.
అవును నిజమే అని మీరూ అంటారు.ధోనీ క్రికెటర్ కాక ముందు టీటీఈగా పని చేశాడు.
ఖరగ్‌పూర్‌లోని థామస్ అనే వ్యక్తికి చెందిన టీ స్టాల్ కు రోజూ వెళ్లి చాయ్ తాగేవాడు.కొద్ది రోజుల క్రితం కోల్‌కతాలో విజయ్ హజారే ట్రోఫీ జరిగింది ఈ సందర్భంగా మ్యాచ్‌లో ధోనీ థామస్‌ను చూశాడు.
వెంటనే అతన్ని గుర్తు పట్టి పలకరించాడు.అతనికి చక్కని డిన్నర్ పార్టీ ఇచ్చాడు.
మంచి చెడ్డలు తెలుసుకున్నాడు.
ఇక ధోనీ స్పెషాలీ హెలికాప్టర్ షాట్.
అతడి ఫ్రెండ్ సంతోష్ లాల్ దీన్ని కనిపెట్టాడు.ధోనీలాగే అతను కూడా క్రికెటర్.
ఇద్దరూ గతంలో ఇండియన్ రైల్వేస్‌లో పనిచేశారు.క్రికెట్ మ్యాచ్‌లూ కలిసి ఆడేవారు.
అప్పుడే ధోనీకి ఈ షాట్ నేర్పించాడు.అనంతరం ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వచ్చాడు.
అయినా తన స్నేహితున్ని మాత్రం ధోనీ మరువలేదు.సంతోష్ లాల్ పాంక్రియాటైటిస్ తో బాధపడుతున్నట్లు ధోనీ తెలుసుకున్నాడు.
అతడికి ఢిల్లీలో ట్రీట్మెంట్ ఇప్పించాడు.అయితే దురదృష్టవశాత్తూ సంతోష్ చికిత్స పొందుతూ చనిపోయాడు.
తన స్నేహితుడి కుటుంబానికి ధోనీ ఆర్థికసాయం చేసి అండగా నిలబడినట్లు తెలిసింది.మంచి మనసున్న మనిషి ధోనీ అని ఈ రెండు ఘటనలు వెల్లడిస్తున్నాయి.