బరువు తగ్గాలంటే తినే మోతాదుని తగ్గించడం, సరైన వ్యాయామం చేయడం మాత్రమే సరిపోదు.నిజానికి ఎంత తింటున్నాం అనే దాని కన్నా, ఏం తింటున్నాం అనే విషయం గుర్తుంచుకోవాలి.
ఎలాంటి కూరగాయలు బరువు పెంచుతాయో, ఎలాంటి కూరగాయలు బరువు తగ్గిస్తాయో తెలుసుకోవాలి.ఆ అవగాహన ఉన్నప్పుడే మంచి డైట్ పాటించి బరువు తగ్గగలం.
ఇప్పుడు ఎలాంటి కూరగాయల జోలికి వెళ్ళకపోతే బరువు తగ్గవచ్చో చూద్దాం. మొక్కజొన్నలో ఫ్రుక్టోస్ శాతం ఎక్కువ.
కాబట్టి మొక్కజొన్న బాగా తింటూ బరువు తగ్గాలనుకుంటే, మీరు చేసే ప్రయత్నాలన్ని వృధ అవుతాయి.
కాలిఫ్లవర్ శరీరానికి బాగా ఉపయోగకరమైన ఆహారమే అయినా, బరువు తగ్గాలి అని నిర్ణయించుకున్నవారికి మాత్రం ఇది సహాయపడదు.
ఎందుకంటే ఇది అయోడిన్ ని ఆపేసి మెటబాలిజం రేట్ ని తగ్గిస్తుంది.దాంతో మీరు బరువు తగ్గడం కష్టమైపోతుంది.
ఆలుగడ్డ మన ఇంట్లో తరుచుగా వండుకొని, ఇష్టంగా తినే కూరే కావచ్చు.కాని మీరే గనుక బరువు తగ్గాలనుకుంటే ఆలుగడ్డని పక్కనపెట్టాల్సిందే.
స్టార్చ్ లెవెల్స్ అధికంగా కలిగే ఆలుగడ్డ మీ బరువుని పెంచుతుందే తప్ప తగ్గించదు.<కొందరు వంటకాల్లో రుచి కోసం గ్రీన్ పీస్ వాడతారు.
మరికొందరు పీస్ మీద ఇష్టంతో స్పెషల్ గా కూర చేసుకొని లాగించేస్తారు.బరువు తగ్గాలనుకుంటే ఈ అలవాటు కూడా మానేయాల్సిందే.