భారత క్రికెట్ లో రోహిత్ శర్మకు ప్రత్యేక చరిత్ర సృష్టించుకున్నాడు.రోహిత్ శర్మకు ఉన్న స్పెషల్ టాలెంట్ అందరిలో కంటే రోహిత్ ను స్పెషల్ గా నిలుపుతుంది.
అందుకే రోహిత్ శర్మ టీమిండియాలో స్థానం కోల్పోకుండా కొనసాగుతున్నాడు.అయితే ఇక రోహిత్ శర్మ రికార్థుల రారాజుగా కొనసాగుతున్నాడు.
డబుల్ సెంచరీ చేసి ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ మేధావులనే తన వైపు తిప్పుకున్నాడు.అయితే ఇటు అంతర్జాతీయ మ్యాచ్ లలో మాత్రమే కాకుండా కెప్టెన్సీ పరంగా కూడా సత్తా చాటిన విషయం తెలిసిందే.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ కు అత్యధిక విజయాలు సాధించి పెట్టిన కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు.అయితే తాజాగా రోహిత్ శర్మ చేసిన ఈ ట్వీట్ నెటిజన్ల మనసును దోచింది.
తన కూతురు ఫోటో ను షేర్ చేస్తూ ఒక ఆడపిల్ల తండ్రిగా గర్వపడుతున్నా అని చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.ఇక ఈ ట్వీట్ తో అమ్మాయిల మనసు దోచుకున్నాడు రోహిత్ శర్మ.
మహిళల పట్ల నీకున్న గౌరవానికి హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు రోహిత్ శర్మ ట్వీట్ పై కామెంట్స్ చేస్తున్నారు.అంతేకాక ఐపీఎల్ సమయంలో కూడా రకరకాల సామాజిక సమస్యలపై షూపై రాసుకొచ్చి తనదైన శైలిలో స్పందించాడు రోహిత్ శర్మ.