తెలంగాణ మంత్రి కేటీఆర్ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరగడం పై సోషల్ మీడియాలో మండిపడ్డారు.బిజెపి ప్రభుత్వాన్ని అదేవిధంగా ప్రధాని మోడీని టార్గెట్ చేసి తనదైన శైలిలో కామెంట్లు చేశారు.
డబుల్ ఇంజన్ సర్కార్ అని బీజేపీ వాళ్లు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు.మనకి అర్థం కావడం లేదు అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
డబుల్ ఇంజన్ అంటే పెట్రోల్ డీజిల్ ధరలు డబుల్ చేయడం, కార్పొరేట్ సంస్థల సంపద డబుల్ చేయటం, నిత్యావసర వస్తువుల ధరలు డబుల్ చేయడం, గ్యాస్ ధరలు డబుల్ చేయటం అంటూ ట్విట్టర్ లో కేటీఆర్ మోడీ పై బిజెపి పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి గతంలో యూపీఏ ప్రభుత్వాన్ని.
లెటర్లో ప్రశ్నించిన కామెంట్లను కోట్ చేస్తూ మోడీని ప్రశ్నించారు.అదేవిధంగా మిషన్ భగీరథ పథకానికి.
భారత ప్రభుత్వ సహకారం ఎంత ఉంది దయచేసి తెలంగాణ ప్రజలతో పంచుకోండి.మిషన్ భగీరథ స్కీమ్ కి మీ ప్రభుత్వం సున్నా సహకారం అందించడం ప్రధాన మంత్రి స్థాయికి ఏమాత్రం తగ్గదని కేటీఆర్.
సోషల్ మీడియా లో సంచలన కామెంట్లు చేశారు.