అమెరికా : పాలస్తీనా మద్ధతుదారుల నిరసనలు.. భారత సంతతి నేత కమ్యూనిటీ సెంటర్ ధ్వంసం

తన డెట్రాయిట్ కమ్యూనిటీ సెంటర్‌ను( Detroit Community Center ) ధ్వంసం చేయడంపై భారత సంతతికి చెందిన యూఎస్ ప్రతినిధుల సభ సభ్యుడు శ్రీథానేదర్( Shri Thanedar ) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ఘటనను ఖండిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

 Indian-american Congressman Shri Thanedar Community Centre Defaced With Pro-pale-TeluguStop.com

ఈ భవనంపై జాత్యహంకార, కాల్పుల విరమణ, ఫ్రీ పాలస్తీనా( Free Palestine ) పదాలను రాశాయి అల్లరిమూకలు.కాంగ్రెస్‌ సభ్యునిగా తాను ఎల్లప్పుడు చర్చలకు సిద్ధంగానే వుంటానని.

దురదృష్టవశాత్తూ , కమ్యూనిటీ సెంటర్ విధ్వంసం సరికాదని శ్రీథానేదర్ ట్వీట్ చేశారు.

గత డిసెంబర్‌లో జరిగిన హాలిడే పార్టీ హింసాత్మకంగా మారిందని ఆయన గుర్తుచేశారు.

కమ్యూనిటీని ఏకాతాటిపైకి తీసుకురావడానికి రూపొందించిన ప్రదేశాన్ని నాశనం చేశారని శ్రీథానేదర్ మండిపడ్డారు.ఉత్పాదక , గౌరవప్రదమైన సంభాషణకు తాను సిద్ధమేనని.

కానీ ఈ విధ్వంసం ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.ఇజ్రాయెల్ వ్యతిరేక పోస్ట్‌లకు సంబంధించి తన సోషల్ మీడియా ఖాతాలలో ఒకటి హ్యాక్ చేయబడిందని శ్రీథానేదర్ గతేడాది డిసెంబర్‌లో తెలిపారు.

Telugu Adam Hollier, Indianaerican, Israel, Pro Palestine, Propalestine, Shri Th

మరోవైపు.యూఎస్ కాంగ్రెషనల్ ఎన్నికల్లో( US Congressional Elections ) శ్రీథానేదర్‌కు షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.యూఎస్ కాంగ్రెషనల్ బ్లాక్ కాకస్.మిచిగాన్‌లోని 13వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లో శ్రీథానేదర్‌‌ను తొలగించాలని పావులు కదుపుతోంది.యూఎస్ కాంగ్రెషనల్ బ్లాక్ కాకస్ చైర్ స్టీవెన్ హార్స్‌ఫోర్డ్, మాజీ చైర్ జాయిస్ బీటీలు డెమొక్రాటిక్ ప్రైమరీలో థానేదర్‌కు కాకుండా ఆడమ్ హోలియర్‌కు మద్ధతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.ఇది గణనీయమైన రాజకీయ మార్పును సూచిస్తుంది.

మిచిగాన్‌లోని 13వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్, నల్లజాతీయుల జనాభా గణనీయమైన స్థాయిలో వుంది.ఇప్పటి వరకు ప్రతినిధుల సభలో నల్లజాతి ప్రతినిధి లేరు.

Telugu Adam Hollier, Indianaerican, Israel, Pro Palestine, Propalestine, Shri Th

యూఎస్ ఆర్మీ నుంచి గవర్నర్ విట్మర్ కేబినెన్ వరకు ఆడమ్ హోలియర్( Adam Hollier ) తన కమ్యూనిటీకి, దేశానికి సేవ చేస్తూ వస్తున్నారని హార్స్‌ఫోర్డ్ ఒక ప్రకటనలో తెలిపారు.అతను సమర్ధవంతమైన ప్రతినిధిగా కొనసాగిస్తాడని, ప్రజలను రాజకీయాలపై నిలబెడతారని, స్వేచ్ఛను కాపాడుకోవడం, మన హక్కుల కోసం పోరాడటం, ప్రతి ఒక్కరికీ అవకాశాలను కల్పించడం వంటి ప్రాముఖ్యతను ఆయన అర్ధం చేసుకున్నారని హార్స్‌ఫోర్డ్ చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube