తెలుగు సినీ ఇండస్ట్రీలో విదేశీ హీరోయిన్ల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది.ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంగ్లాండ్ బ్యూటీ ఒలివియా మోరిస్ టాలీవుడ్ డెబ్యూ చేసిన విషయం తెలిసిందే.
కాగా ఇప్పుడు ప్రిన్స్ సినిమాతో ఉక్రెయిన్ బ్యూటీ మరియా టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది.మరియా పూర్తి పేరు మరియా ర్యాబోషప్కా.
కానీ సింపుల్ గా ఆమెని మరియా అని పిలుస్తుంటారట.అయితే ఇప్పటివరకు తెలుగులోకి ఎంతోమంది ఫారెన్ మోడల్స్, హీరోయిన్స్ ఐటెమ్ సాంగ్స్ వరకే చూస్తూ వచ్చాము.
కానీ ఈ మధ్య విదేశీ ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా అవకాశాలు అందుకుంటున్నారు.
సినిమా హిట్ అవ్వడంతో సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్ లో అవకాశాలను దక్కించుకుంటున్నారు.
తెలుగు సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది మరియా.తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ సరసన హీరోయిన్ గా అవకాశం దక్కించుకోవడంతో ఆ వార్త విన్న తెలుగు తమిళ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ప్రిన్స్ సినీమా నుండి మరియా ఫస్ట్ లుక్, బింబిలిక్కి, జెస్సికా సాంగ్స్ రిలీజ్ అయిన తరువాత అందరి దృష్టి ఉక్రెయిన్ బ్యూటీ మరియా పైనే పడింది.పేరుకు బ్రిటిష్ పిల్లే అయినా ఇండియన్ ట్రెడిషనల్ లుక్కుతో సినిమాలో అలరించనుంది.
ప్రస్తుతం మరియా వయసు 25 .

ప్రిన్స్ సాంగ్స్, ట్రైలర్, ప్రమోషన్స్ లో తన అందం, అమాయకత్వంతో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది మరియా.ఇకపోతే మరియా విషయానికి వస్తే…2018లో ఈథర్ అనే ఇంగ్లీష్ సినిమాతో నటిగా కెరీర్ ఆరంబించిన మరియా 2021లో స్పెషల్ ఓపీఎస్ 1.5 అనే హిందీ వెబ్ సిరీస్ ద్వారా ఇండియన్ ప్రేక్షకులకు పరిచయమైంది.ఇప్పుడు హీరోయిన్ గా ప్రిన్స్ మూవీతో తెలుగు, తమిళ ప్రేక్షకులను పలకరించనుంది.ఇదిలా ఉండగా ఉక్రెయిన్ లో యుద్ధ వాతావరణం కొనసాగుతుండగా.ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని చెబుతూ స్టేజిపై కంటతడి పెట్టుకుంది.అంతేకాకుండా ప్రిన్స్ సినిమాలో వచ్చే రెమ్యూనరేషన్ మొత్తం పెద్ద వాతావరణం లో నష్టపోయిన వారికి ఇస్తాను అని ప్రకటించడంతో ప్రేక్షకులు మొత్తం ఫిదా అయ్యారు.







