అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎపిక్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’.ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించాడు.
ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.వీరిద్దరూ నటన పరంగా అదరగొట్టి ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించు కున్నారు.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో ఇద్దరు హీరోలు కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు.ఈ సినిమా క్రేజ్ తోనే ప్రెజెంట్ వీరు తిరుగులేని స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక వీరి క్రేజ్ పాన్ ఇండియా కూడా దాటి పాన్ వరల్డ్ స్థాయికి చేరుకుంది.ఇప్పుడు ఈ సినిమాను జపాన్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు.ఈ సినిమా జపాన్ వర్షన్ లో అక్టోబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది.
ఈ క్రమంలోనే రాజమౌళి తో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా జపాన్ వెళ్లి అక్కడ ప్రొమోషన్స్ చేస్తున్నారు.
అక్కడ కూడా ఎన్టీఆర్ క్రేజ్ ఏంటో తెలుస్తుంది.తాజాగా ఎన్టీఆర్ కోసం అకక్డ ఫ్యాన్స్ ఒక స్పెషల్ మెసేజ్ తో లెటర్ ఒకటి ఇచ్చాడు.

ఈయన ఉంటున్న హోటల్ లో పనిచేస్తున్న మహిక తనంటే ఎంత ఇష్టం అనేది రాస్తూ ఇచ్చిన లెటర్ చూసి ఆయన ఫిదా అయ్యాడు.
అక్కడ కూడా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు.అది కూడా ఇంతగా అభిమానించే వారు ఉన్నారు అని తెలిసి ఆయన షాక్ తో పాటు సర్ప్రైజ్ అయ్యాడు.ఈయన ఆ మహిళతో కొద్దీ సేపు ముచ్చటించి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారు.
ప్రెజెంట్ దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించాడు.
మరి ఈ సినిమా అక్కడ ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.







