ప‌వ‌న్ ప‌రిణితి చెందేదెన్న‌టికి?

జనసేన పార్టీ ప్రారంభించి ఎనిమిదేళ్లు గడిచిపోయినా పవన్ మాత్రం రాజకీయ పరిణితి సాధించలేదు.ఇప్ప‌టికే చాలా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ మోస్ట్ పాపులర్ ఫేయిల్డ్ పొలిటీషియన్ గా రికార్డుకెక్కారు.

 Poltical Carrier Of Pawan Kalyan , Pawan Kalyan, Ap Poltics, Ycp, Ys Jagan, Jana-TeluguStop.com

ఎలాంటి ఎజెండా లేకుండా కార్యక్రమాలకు పిలుపు ఇస్తుంటాడు.ఏ ప్రోగ్రామ్ చేసినా ఆరంభ శూరత్వమే తప్ప.

కమిట్మంట్ మాత్రం కనిపించదు.మొదట్లో హడావుడి చేయడం.

ఆ తర్వాత కాడి వదిలేయడం ఆయనకు తెలిసినంత ఎవరికి తెలియదు.ఎనిమిదేళ్లుగా పవన్ చెప్పిన మాటలకు.

చేసిన పనులకు ఎకంకడా పొంతన ఉండదు.కుంభకర్ణుడిలా నిద్రలేచినట్టు సడెన్ గా రోడ్లపైకి వస్తాడు.

కొన్నాళ్లకు మళ్లీ ఎవరికి కనిపించకుండా పారిపోవడమే ఆయన నైజం.

పవన్ పూనకం వచ్చిన వాడిలా రోడ్లపైకి వస్తుంటాడు.

పార్ట్ టైం పొలిటీషియన్ గా కనిపిస్తుంటాడు.ఏపీలో రోడ్లు ఆధ్వాన్నంగా ఉన్నాయని.

గుడ్ మార్నింగ్ సీఎం ప్రోగ్రాం తలపెట్టి నానా హడావుడి చేశాడు.కాకినాడ – అనంతపురంలో రోడ్ల రిపేర్ల కోసం శ్రమదానం చేసి మధ్యలోనే వదిలేశాడు.

మళ్లీ కొన్నాళ్లకు జనవాణి అంటూ కొత్త స్లోగన్ అందుకున్నాడు.ప్రతీ వారం సామాన్యుల నుంచి ఫిర్యాదుల తీసుకుంటానని బిల్డప్ ఇచ్చి.

పత్తాలేకుండా పోయాడు.విశాఖ గర్జనకు ప్రజాస్పందన రావడంతో మళ్లీ జనవాణి గళమెత్తి.

చంద్రబాబుతో ప్యాకేజీ ఫిక్స్ చేసుకున్నాడు.పవన్ తలపెట్టిన ఏ కార్యక్రమం కూడా సక్సెస్ అయిన దాఖలాలు లేవు.

విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నా అంటూ ట్విట్టర్లో చెలరెగిపోయాడు.ప్రైవేటీకరణను వ్యతిరేకించిన పవన్ కల్యాణ్.

కేంద్రాన్నినిలదీయకుండా కేవలం వైసీపీనే టార్గెట్ చేస్తున్నాడు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనడు.

ఏమాత్రం సబంధం లేని వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబుతో కలిసి విషం చిమ్ముతూనే ఉంటాడు.విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ ఓరోజు దీక్షలు అంటాడు.

ఆ తర్వాత మర్చిపోతాడు.మళ్లొకసారి డిజిటల్ ప్యాపెయిన్ అంటూ పార్ట్ టైమ్ పొలిటిషీయన్ మాదిరిగా షో చేస్తుంటాడు.

కమిట్మెంట్ తో ఏనాడు పనిచేయడు.

Telugu Ap Poltics, Chaandra Babu, Janasena, Jogiramesh, Pawan Kalyan, Roja, Ys J

కౌలురైతులకు మద్దతుగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థికసాయం చేస్తానని పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు.సీఎం జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందులతో పాటు మరికొన్ని జిల్లాల్లో చెక్కులు అందించి చేతులు దులుపుకున్నారు.ఆ తర్వాత ఆ సంగతే మర్చిపోయారు.

చేపల చెరువులపై దళారులు పెత్తనం చెలాయిస్తున్నారని ప్రభుత్వం 217 జీవో తీసుకొచ్చింది.అయితే పవన్ మాత్రం మత్స్యకారుల జీవన పరిస్థితులను దెబ్బతీసేలా ఉందని అప్పట్లో నరసాపురంలో రంకేలేశారు.ఆ తర్వాత ఈ ఊసూ కూడా ఎత్తలేదు.మత్స్యకారులను పట్టించుకున్న పాపాన పోలేదు.విశాఖకు గర్జనకు వచ్చిన ప్రజాస్పందనను ఓర్వలేక.ఈ రహస్య స్నేహితులిద్దరూ ఉత్తరాంధ్రపై విషం చిమ్ముతున్నారు.

నాన్ పొలిటికల్ జేఏసీ నిర్వహించిన ప్రజాగర్జనపై చర్చ జరగకుండా మోసగాడు చంద్రబాబు తన దత్తపుత్రుడిని సీన్లోకి దింపారు.మీడియా అటెన్షన్ ప్రజాగర్జనపై సక్సెస్ పై పడకుండా పవన్ ను ఉసిగొల్పారు.

ప్రీప్లాన్డ్ గా మంత్రులు రోజా, జోగిరమేష్ కార్లపై ఎయిర్ పోర్టులో రౌడీమూకలతో దాడి చేయించారు.ఆ తర్వాత కొద్దిసేపటికే పవన్ విశాఖలో వాలిపోయారు.

ఇక అక్కడి నుంచి కథ, స్క్రీన్ ప్లే మొత్తం పవన్ నడిపించారు.విశాఖ ఎపిసోడ్ నుంచి చంద్ర‌బాబు భేటీ వ‌ర‌కూ అన్నీ టీడీపీ క‌నుస‌న్న‌ల్లో జరిగాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube