గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో నయనతార, విఘ్నేశ్ శివన్ ల పేర్లు మారు మోగుతున్న విషయం మనందరికీ తెలిసిందే.ఇటీవల నయనతార దంపతులు సరోగసి ద్వారా పిల్లలకు తల్లిదండ్రులు అయ్యాము అని ప్రకటించడంతో ఈ వివాదం రాజుకుంది.
దీంతో అప్పటినుంచి ఈ వివాదానికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.ఈ విషయంపై ఈ జంట ప్రభుత్వానికి వివరణ ఇవ్వడంతో ఆ వివాదం కాస్త ముగిసింది.
ఇలా ఉంటే తాజాగా విఘ్నేశ్ శివన్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక స్టోరీని షేర్ చేశాడు.అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అందులోఈ విధంగా రాసుకొచ్చాడు.మనకు మంచి రోజులు ఉన్నాయి.
కానీ ఫ్రస్టేషన్ ఉన్న రోజులు కూడా కొన్నిసార్లు మనకు మంచిదే.ప్రతిదానిలో మంచిని చూసేందుకు ప్రయత్నిచండి.
అందుకు ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకోండి.మీ జీవితంలో ఆనందం అనేది మన ఆలోచనలపైనే అధారపడి ఉంటుంది.
అని రాసుకొచ్చాడు విఘ్నేశ్ శివన్.

ఆ పోస్టులు బట్టి చూస్తే ఇటీవల నయనతార కవలలకు జన్మనివ్వడంతో వచ్చిన వివాదాన్ని ఉద్దేశించే చేసినట్లు అభిమానులు భావిస్తున్నారు.మరి నెటిజన్స్ అనుకుంటున్న విధంగా విఘ్నేశ్ శివన్ ఉద్దేశపూర్వకంగా చేశాడా లేకపోతే మామూలుగా పోస్ట్ చేశాడా అన్నది తెలియాలి అంటే విగ్నేష్ రిప్లై ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.ఇకపోతే ఈ జంట గత కొంతకాలంగా ఈ ఏడాది మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.పెళ్లి తర్వాత ఏదో ఒక విషయం పై వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు నయనతార,విగ్నేష్.







