టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నాగచైతన్య సవ్యసాచి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి నిధి అగర్వాల్. ఈ సినిమా పెద్దగా గుర్తింపు తీసుకురాలేదని చెప్పాలి.
ఇక ఈ సినిమా తరువాత ఈమె పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ ముద్ద గుమ్మకు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి.
ఇక ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నిధి అగర్వాల్ ఇండస్ట్రీ గురించి చేసినటువంటి బోల్డ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే కేవలం టాలెంట్ మాత్రమే సరిపోదు అందం కూడా ఉండాలి.మన అందం చూసిన తర్వాతే అవకాశాలు వస్తాయి.
అలాగే అందంగా ఉన్నప్పటికీ ఆ అందాలను చూపెడితేనే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇండస్ట్రీలో కొనసాగాలంటే అందం చూపించాల్సి ఉంటుంది.అందం దాచుకుంటే ఇక్కడ నిలబడలేమంటూ ఈమె చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.నిధి అగర్వాల్ నటించిన పలు సినిమాలలో పూర్తి గ్లామర్ షో చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేశారు.
అయితే పాత్ర డిమాండ్ చేస్తే తాను గ్లామర్ షో చేయడానికి ఏమాత్రం వెనకాడనని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి.ఇక స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు కనుక వస్తే రెమ్యూనరేషన్ విషయంలో తను డిమాండ్ చేయనని కూడా ఈమె తెలిపారు.