తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ విష్ణు ప్రియ భీమినేని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.బుల్లితెర పై పోవే పోరా అనే షోలో సుధీర్ తో కలిసి హోస్ట్ గా చేస్తు.
భీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న విషయం తెలిసిందే.ఈ ముద్దుగుమ్మ కి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఒక హీరోయిన్ రేంజ్ లో అభిమానులని సంపాదించుకుంది.అయితే బుల్లితెరపై హోస్ట్ గా కనిపించే సమయంలో చాలా పద్ధతిగా ఉండే విష్ణుప్రియ సోషల్ మీడియాలో మాత్రం పొట్టి పొట్టి డ్రెస్సులతో హాట్ ఫోటో షూట్స్ చేస్తూ రెచ్చిపోతూ ఉంటుంది.
ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోని షేర్ చేసింది.
ఆ వీడియోలో విష్ణు ప్లీజ్ నన్ను అన్‌ఫాలో చేయండి అని వేడుకుంది.అదేంటి అనుకుంటున్నారా.పూర్తి వివరాల్లోకి వెళితే.విష్ణు ప్రియ ఫేస్‌బుక్ అకౌంట్‌ని ఎవరో హ్యాక్ చేసి,అశ్లీల ఫొటోలను పోస్ట్ చేశారు.
ఆ ఫొటోలను చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.వంటిపై ఒక్క వస్త్రం కూడా లేకుండా న్యూడ్‌గా ఉన్న ఆ ఫొటోలను చూసి విష్ణుప్రియ కు ఏమైంది.
మరీ ఇంతగా దిగజారిపోయిందేంటి? అంటూ కామెంట్స్‌తో ఒక్కసారిగా ఆమెను దూషించడం మొదలెట్టారు.అంతటితో ఆగకుండా ఆమె ఖాతాలో ఇతరుల అశ్లీల ఫోటోలను కూడా షేర్ చేసారు.
అప్పుడు విష్ణు అకౌంట్ హ్యాక్ అయినట్లుగా అందరికీ అర్థమైంది.
మార్ఫింగ్ ఫేస్‌లతో అశ్లీలంగా కనిపించిన ఆ ఫొటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాని షేక్ చేశాయి.దాంతో వెంటనే తేరుకున్న విష్ణుప్రియ తన అకౌంట్ హ్యాక్ అయిందంటూ ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేసింది.అందరికీ నమస్కారం.
నా ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయిందని అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.మార్నింగ్ నుంచి నాకు చాలా మెసేజ్‌లు వస్తున్నాయి.
ఆ కంటెంట్ ఏంటి? అసలు ఏం జరిగింది? అంటూ ఒకటే మెసేజ్‌లు.రెండు మూడు నెలలుగా నేను.
నా అకౌంట్ కోసం ప్రయత్నిస్తున్నాను ఇంకా అది నా ఆధీనంలోకి రాలేదు.ఇప్పటికి రెండు సార్లు నా అకౌంట్ హ్యాక్ అయింది.
అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది.దయచేసి ఆ పేజీపై రిపోర్ట్ చేయండి.
అన్‌ఫాలో చేయండి అని తన అభిమానులను కోరింది విష్ణు ప్రియ.