ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో నీటి కొరత విపరీతంగా పెరిగిపోయింది.టోకెన్స్ ఇచ్చి మరి నీళ్ల ను జనాలు కొనుక్కోవాల్సిన పరిష్టితి ఏర్పడడం తో ఆ రాష్ట్రం నీటి ఎద్దడి తో బాగా అల్లాడుతోంది.
రాజధాని చెన్నై కు నీటిని సరఫరా చేసే అన్ని రిజర్వాయర్లు కూడా ఎండిపోవడం తో ఆ రాష్ట్రం నీటి కొరత తో అల్లాడుతోంది.ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్ర పరిస్థితిని చూసి కరిగిపోయిన కేరళ రాష్ట్రం నీటి సాయం కోసం ముందుకువచ్చినట్లు తెలుస్తుంది.
చెన్నైకు 20లక్షల లీటర్ల నీటిని పంపుతామంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆ రాష్ట్రానికి ఆఫర్ చేశారు.
తిరువనంతపురం నుంచి ప్రత్యేక రైలులో 20లక్షల నీటిని పంపుతామని కేరళ సర్కార్ పేర్కొనగా,దానికి తమిళనాడు ప్రభుత్వం తిరస్కరించినట్లు తెలుస్తుంది.
ఈ విషయంపై కేరళ సీ ఎం ఆఫీసు అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు.చెన్నైలోని పలు ప్రాంతాలు నీరు లేక ఇబ్బందులు పడుతున్నాయి.అందుకే వారికి 20లక్షల లీటర్ల నీటిని తాము ఇవ్వాలనుకుంటున్నట్లు ప్రతిపాదన పంపగా, దానికి తమిళనాడు ప్రభుత్వం తిరస్కరించింది.ప్రస్తుతం తమకు ఎలాంటి అవసరం లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నట్లు అని ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు.
అయితే మరోపక్క తమిళనాడు ప్రభుత్వ వర్గాలు ఈ విషయాన్నీ ఖండిస్తున్నాయి.మేము ఆ ఆఫర్ ని అసలు తిరస్కరించలేదని, కేరళ ఇచ్చిన ఆఫర్‌పై అసలు ఇప్పటి వరకు తాము ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదంటూ తమిళ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు.
అందులోనూ ముఖ్యమంత్రి పళని స్వామి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నందున ఆయన వచ్చే వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని, ఆయన హాస్పటల్ నుంచి తిరిగి వచ్చిన తరువాత దీనిపై ఒక నిర్ణయానికి రానున్నట్లు వారు స్పష్టం చేశారు.కాగా కేరళ ఇచ్చిన ఆఫర్‌పై తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత స్టాలిన్ ట్వీట్ చేస్తూ.‘‘మాకు సహాయం చేసేందుకు ముందుకొచ్చిన కేరళ ప్రభుత్వానికి థ్యాంక్స్.కేరళ ప్రభుత్వంతో తమిళనాడు ప్రభుత్వం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నా’’ అంటూ పేర్కొన్నట్లు తెలుస్తుంది.