ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలలో అధిక బరువు అనేది ఒక అనారోగ్య సమస్యగా మారిపోయింది.అధిక బరువును తగ్గించుకోవడానికి చాలా మంది ప్రజలు రకరకాల డైట్ లు ఫాలో అవుతున్నారు.
ఇంకా చెప్పాలంటే అధిక బరువు తగ్గి నాజూగ్గా కనపడడానికి చాలామంది ప్రత్యేకమైనా ఆహారాన్ని కూడా తీసుకుంటున్నారు.ఇలాంటి ఆహార పదార్థాలలో అధిక బరువు తగ్గడానికి బ్రెడ్ చాలా మంచిదని కొంతమందికి మాత్రమే తెలిసి ఉండవచ్చు.
అందులో కార్బోహైడ్రేట్లు ఉన్న అదనపు శరీర బరువును తగ్గించుకోవడానికి మీరు బ్రెడ్ ను సులభంగా తినవచ్చు.అయితే కొన్ని రకాల రొట్టెలను మాత్రమే అధిక బరువు తగ్గడానికి తినాలని వైద్యా నిపుణులు చెబుతున్నారు.
సాధారణ బ్రెడ్ కంటే గోధుమ పిండితో చేసిన బ్రెడ్ లో అధిక పోషకాలు ఉంటాయి.దీన్ని తినడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.అంతే కాకుండా బరువు కూడా తగ్గి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ఇంకా చెప్పాలంటే టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది.
హోల్ గ్రెయిన్ బ్రెడ్ తృణధాన్యాలతో చేసిన బ్రెడ్.ఇది కూడా బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇందులో ఉన్న వోట్స్, బార్లీ, మొక్కజొన్న ఇంకా ఇతర ధాన్యాలు వంటి వివిధ తృణధాన్యాలకు పోషకాలను అందిస్తుంది.ఈ రొట్టెని ఆహారంలో ప్రతిరోజు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
అంతేకాకుండా ధాన్యపు రొట్టెలు వేగంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి.దీర్ఘకాలిక వ్యాధుల ను కూడా నివారించడానికి తోడ్పడుతాయి.

అలాగే రక్తంలో చక్కెర స్థాయి ని అదుపులో ఉంచడంలో ఉపయోగపడుతుంది.అధిక బరువు తగ్గడంలో బార్లీది ప్రత్యేక పాత్ర ఉంటుంది.ఓట్‌మీల్ బ్రెడ్‌లలో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ బి1, ఐరన్, జింక్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడుతుంది.అంతే కాకుండా అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.