త్రిష( Trisha )… సదా సీదా అమ్మాయిగా ఉండి, తర్వాత జూనియర్ ఆర్టిస్ట్( Junior Artist ) గా కెరియర్ మొదలుపెట్టి నేడు సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది.దాదాపు 20 ఏళ్లకు పైగా కెరియర్ కొనసాగించిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లలో త్రిష కూడా ఉంటుంది.
అయితే కేవలం త్రిష నటించడం వరకు ఓకే కానీ ఆమె చుట్టూ అనేక కాంట్రవర్సీలు కూడా ఎప్పుడూ నడుస్తూ ఉంటాయి.ఆమె కన్నా గొప్ప హీరోయిన్స్ చిన్న హీరోయిన్స్ ఎంతమంది ఉన్నా కూడా ఎందుకు కాంట్రవర్సీలు త్రిష చుట్టూనే ఉంటాయి అనే విషయం అర్థం కాని చిక్కు ప్రశ్న.
ఇప్పుడు తాజాగా ఆమెపై చేసిన అలిగేషన్ మామూలుది కాదు.
ఒక పొలిటికల్ లీడర్ ఆమె 25 లక్షల కోసం ఒక రాజకీయ నాయకుడితో పడుకుంది అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం లేపుతున్నాయి.అంత స్థాయిలో ఉన్న ఆమెపై ఇలాంటి అలిగేషన్ చేయడం అది నిజమో కాదో తెలియదు కానీ దారుణం.దీనిని ఆమె ఖండించింది కూడా.
కానీ ఇలా ఈమెపై కామెంట్స్ చేయడం, గాసిప్స్ క్రియేట్ చేయడం లేదా రూమర్స్ ని ప్రచారం చేయడం కొత్తేమీ కాదు.గతంలో మన్సూర్ అలీ( Mansoor Ali ) ఆమెపై చేసిన వ్యాఖ్యలు, అలాగే దాన్ని ఆమె ఖండించిన విధానం, ఇండస్ట్రీ మొత్తం ఆమెకు సపోర్ట్ గా వచ్చిన తీరు మనమందరం చూసాం.
ఇలా వరుస పెట్టి ఆమెపై కాంట్రవర్సీలు( Controversies ) రావడం అనేది ఎవరైనా కావాలని చేస్తున్నారా లేక ఆమె నిజంగానే ఏదో ఒక తప్పు చేసి అందరికంటే పడుతుందా అనేది అర్థం కావడం లేదు.కానీ తప్పు చేసే ఎంతోమంది మగవాళ్ళు ఉన్న ఇండస్ట్రీలో హీరోయిన్స్ ని మాత్రం ఇలా చీప్ గా పబ్లిక్ గా మాట్లాడటం మాత్రం సరైనది కాదు అనేది అందరూ అంటున్న మాట.ఇలాగే వెళితే రేపటి రోజు వచ్చి ఇంకొకడు ఇంకా ఏదో అంటాడు.హీరోయిన్స్ కి కూడా ప్రైవసీ ఉంటుంది.
వారి వారికి నచ్చినట్టు వారి జీవితాన్ని కొనసాగించే అవకాశం ఇవ్వాలి.కష్టపడి పని చేసి డబ్బులు సంపాదించుకుంటారు ఇంకా ఏదైనా చేస్తారు అది వారి పూర్తి వ్యక్తిగతం.
దాన్ని ప్రశ్నించడానికి ఎవరికి హక్కు లేదు అనే విషయం అందరూ గుర్తుంచుకుంటే బాగుంటుంది.