హర్యానా గురుగ్రామ్ లో దారుణం చోటుచేసుకుంది.టోల్ ప్లాజా ఉద్యోగిని పై ఒక కారు డ్రైవర్ చేయి చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
ఇటీవల టోల్ ప్లాజా ల వద్ద పలువురు తమ జులుం చూపిస్తూ తెగ రెచ్చిపోతున్నారు.
అయితే ఇప్పడు తాజాగా గురుగ్రామ్ లోని ఖేర్కీ దౌలా టోల్ ప్లాజా వద్ద కారు డ్రైవర్ టోల్ ఎమౌంట్ కట్టకుండా ఉన్నదే కాకుండా టోల్ గెట్ ను వెనక్కి నెట్టి ఆవేశంగా వెళ్ళిపోతున్నాడు.
ఈ క్రమంలో మరో ఉద్యోగి అక్కడకు వచ్చి ఆపే ప్రయత్నం చేయడం ఈ లోపు కౌంటర్ దగ్గర ఉన్న మహిళ తో గొడవకు దిగడం జరిగింది.ఈ నేపథ్యంలో టోల్ ఎమౌంట్ కట్టకుండానే ఆవేశం తో ఊగిపోతూ ఆమె పై చేయి కూడా చేసుకున్నాడు.
అంతటితో ఆగకుండా ఆ మహిళ మొహం పై గట్టిగా గుద్దడం తో ఆ మహిళ గాయపడినట్లు తెలుస్తుంది.ఈ క్రమంలో మిగిలిన టోల్ ప్లాజా ఉద్యోగులు అందరూ అక్కడకు చేరుకుని పరిస్థితి తెలుసుకొనే లోపు కారు డ్రైవర్ అక్కడ నుంచి జారుకున్నాడు.అయితే ఈ ఘటన అంతా కూడా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడం తో ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.ప్రస్తుతం కారు డ్రైవర్ పరారీ లో ఉండడం తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.