లాక్ డౌన్ అయినా షూటింగ్స్‌ ఎలా జరుగుతున్నాయి?

గత ఏడాది లాక్‌ డౌన్ కారణంగా షూటింగ్ లు నిలిచి పోయాయి.దాదాపు రెండున్నర నెలల పాటు షూటింగ్‌ లకు పూర్తిగా బ్రేక్‌ పడింది.

 Tv Shows Shooting Not Stop Even Lock Down , Lock Down, Shooting, Telugu Flim New-TeluguStop.com

షూటింగ్‌ లు నిలిచి పోయిన రెండు వారాల్లోనే సీరియల్స్ మరియు రియాల్టీ షో లు కామెడీ షో లు ఇలా అన్ని కూడా ఎపిసోడ్స్ షూటింగ్‌ చేసినవి లేక పోవడంతో పాత ఎపిసోడ్‌ లను పునః ప్రారంభించారు.ఆ సమయంలో కొత్త సీరియల్స్ లేక పాత ఎపిసోడ్‌ లతోనే ప్రేక్షకులు పిచ్చెక్కి పోయారు.

ఆ సమయంలో చాలా మంది ఓటీటీని ఆశ్రయించారు.ఓటీటీకి కూడా కొత్త కంటెంట్‌ లేక పోవడంతో పాత వీడియోలనే చూడాల్సి వచ్చింది.

కాని ఈసారి మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.లాక్ డౌన్‌ కొనసాగుతున్నా కూడా షూటింగ్ లు జరుగుతున్నట్లుగా ఉన్నాయి.

అందుకే ఏ ఒక్క సీరియల్‌ కాని ఏ ఒక్క షో కాని ఆగి పోలేదు.షూటింగ్‌ లు జరిపేందుకు అనుమతులు లేవు.

అయినా కూడా ఎలా జరుగుతున్నాయంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

సినిమాల షూటింగ్ లు అయితే నిలిచి పోయాయి కాని బుల్లి తెరకు సంబంధించిన షో లు మరియు సీరియల్స్ మాత్రం షూటింగ్ లు కొనసాగుతున్నాయి.

దీంతో పాటు కొన్ని షో లకు సంబంధించిన షూటింగ్ లు ఇప్పటికే కొన్ని జరిగాయి.వాటినే టెలికాస్ట్‌ చేస్తున్నామని అంటున్నారు.లాక్‌ డౌన్‌ లో కొంత వెసులుబాటు ఉన్న కారణంగా షూటింగ్‌ ను జరుపుతున్నారు అంటూ కొందరు చెబుతున్నారు.ఉదయం ఆరు నుండి 10 గంటల వరకు సమయం ఉన్న కారణంగా ఆ సమయంలో స్టూడియోలోకు వెళ్తున్నారు.

అక్కడ షూటింగ్‌ ను కంటిన్యూస్ గా జరిపి తర్వాత రోజు బయటకు వెళ్తున్నారట.అలా షూటింగ్ ను లాక్ డౌన్‌ సమయంలోనూ బుల్లి తెర వర్గాల వారు షూటింగ్స్ నిర్వహిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube