ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి వావి వరసలు, చిన్న పెద్ద అనే తేడాలు లేవు.కేవలం ఎదుటి వ్యక్తుల ఆకర్షణకు లోనైతే వారి మధ్య ఉండే సంబంధాన్ని తుడిచిపెట్టి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.
భర్తకు తెలియకుండా భార్య.భార్యకు తెలియకుండా భర్త వివాహేతర సంబంధాలు పెట్టుకుని చివరకు తమ జీవితాలను విషాదంగా ముగించుకుంటున్నారు.
ఇలాంటి కోవకు చెందిన ఒక సంఘటన ఇటీవలే మధ్యప్రదేశ్లో హాట్ టాపిక్ గా నిలిచింది.సొంత కోడలిపై మనసు పడ్డ మామ చివరికి కొడుకు చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.మధ్యప్రదేశ్లోని( Madhya Pradesh ) భూత్ బంధాని గ్రామంలో దరోగ్ సింగ్ అనే వ్యక్తి తన కొడుకు సంజయ్ ధుర్వే తో కలిసి నివాసం ఉంటున్నాడు.కొంతకాలం క్రితం సంజయ్ కు ఓ యువతితో వివాహం జరిగింది.
అప్పటినుండి ఆ ఇంట్లో ముగ్గురు కలిసి ఉండేవారు.సంజయ్ ఉదయం డ్యూటీ కి వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చేవాడు.
ఇంతవరకు వీరి కుటుంబం సంతోషంగానే ఉంది.

కానీ దరోగ్ సింగ్ కు పాడు బుద్ధి పుట్టింది.ఇంట్లో ఒంటరిగా ఉండే అందమైన కోడలిపై మనసు పడ్డాడు.కొంతకాలం తర్వాత కోడలు తన మామకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.
ఇంట్లో కొడుకు లేని సమయంలో కోడలు- మామ ఎంజాయ్ చేయడం ప్రారంభించారు.సంజయ్ కు తన తండ్రిపై, తన భార్యపై అనుమానం రావడంతో ఇద్దరిపై నిఘా పెట్టాడు.
తన భార్యకు, తన తండ్రికి మధ్య అక్రమ సంబంధం( Extramarital Affairs ) ఉందనే విషయం తెలిసి తండ్రి పై కోపం పెంచుకున్నాడు.ఇక తండ్రిని చంపేయాలని నిర్ణయించుకొని మాస్టర్ ప్లాన్ రచించాడు.
ఇటీవలే తాజాగా ఒక విషయం గురించి మాట్లాడాలని తన తండ్రి దరోగ్ ను బయటకు తీసుకువెళ్లి అక్రమ సంబంధం పై తండ్రిని ప్రశ్నించాడు.తండ్రి కొడుకుల మధ్య కాసేపు గొడవ జరిగింది.
కొడుకు క్షణికావేశంలో తండ్రిని చంపేశాడు.ఈ విషయం సంజయ్ భార్యకు తెలియడంతో భయంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
చుట్టుపక్కల ఉండే స్థానికులు పోలీసులకు( Police ) సమాచారం అందించడంతో రెండు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.నిందితుడు సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.







