వైరల్: వలలో చిక్కుకున్న కాకిని కాపాడిన బాలుడు... నెటిజన్ల ప్రశంసలు!

చిన్నపిల్లలు దైవంతో సమానం అంటారు.ఆ విషయాన్ని నిజం చేస్తూ తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

 Viral The Boy Who Saved The Crow Caught In The Net Netizens Praise ,boy, School,-TeluguStop.com

కాగా ఆ వీడియో చూసిన నెట్టింట్లో జనాలు ఆ పిల్లలని ఆకాశానికెత్తేస్తున్నారు.అవును, నేటి సమాజంలో ద‌యాగుణం క‌లిగిన‌వారు చాలా అరుదుగా క‌నిపిస్తుంటారు.

మ‌న‌సంతా క‌రుణ క‌లిగిన ఓ బాలుడి వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ బాలుడు చేసిన పని ఎంతో స్ఫూర్తిదాయకంగా వుంది.

విషయం ఏమంటే, వ‌ల‌లో ఓ కాకి చిక్కుకొని విలవిలలాడుతోంది.అది ఎప్పటినుండి అలా వుందో ఎవ్వరికీ తెలియదు.అయితే దాన్ని ఓ స్కూల్ బాలుడు చూసి, మనసు కరిగి దానిని కాపాడాడు.ఆ వెంటనే ఆ కాకిని గాల్లోకి వదిలేసాడు.

ఆ వయసు పిల్లలు మరెవరైనా ఐతే దానిని కాపాడిన తరువాత దానితో ఆడుకోవాలని చూసేవారు.కానీ ఆ కుర్రాడు అలా చేయలేదు.

కాగా దానికి స్వేచ్ఛ ప్ర‌సాదించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.స‌బితా చంద అనే యూజ‌ర్ ఈ వీడియోను ట్విట్ట‌ర్‌లో షేర్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.

సదరు వీడియో ఆన్‌లైన్‌లో షేర్ చేసినప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ 76,000 మందికి పైగా చూడడం కొసమెరుపు.ఆ బాలుడు ఆ కాకిని రక్షించే సమయంలో అత‌డి క్లాస్‌మేట్స్ కూడా చుట్టూ చేరి ప‌క్షికి స్వేచ్ఛ ల‌భించ‌డంతో ఆనందంతో చప్ప‌ట్లు కొట్టడం జరిగింది.వారి కరుణామ‌య హృద‌యం ఎన్నో జీవితాల‌ను స్పృశిస్తుంద‌ని ఈ పోస్ట్‌కు క్యాప్ష‌న్ ఇవ్వడం ఇక్కడ గమనించవచ్చు.కామెంట్స్ సెక్ష‌న్‌లో ట్విట్ట‌ర్ యూజ‌ర్లు స్కూల్ బాలుడిపై ప్ర‌శంస‌లు గుప్పించారు.

ఈ బాలుడికి చాలా ద‌యాగుణం ఉంద‌ని ఓ యూజ‌ర్ కామెంట్ చేయ‌గా ఎంతో సునిశిత‌మైన బాలుడని మ‌రో యూజ‌ర్ రాసుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube