టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.20 ఏళ్ల క్రితం ఎందరో అమ్మాయిలకు డ్రీమ్ బాయ్.లవర్ బాయ్.తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్.అతి తక్కువ కాలంలోనే ఎవరి సపోర్ట్ లేకుండా సూపర్ హీరో అయ్యాడు.ఈ హీరో సినిమాలు చూసి ఎంతోమంది పెద్ద ఫ్యాన్స్ అయ్యారు.
ఇంకా ఇతడు కూడా అంతే.సినిమాలు హిట్ అవ్వగానే పెద్దవారందరు సపోర్ట్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి తన కూతురును ఉదయ్ కిరణ్ కి ఇచ్చి పెళ్లి కూడా చెయ్యాలనుకున్నాడు.అలానే నిశ్చితార్థం కూడా అయ్యింది.
కానీ ఉన్నట్టుండి ఏమైందో తెలియదు నిశ్చితార్థం ఆగిపోయింది.మెగాస్టార్ అల్లుడు అని వచ్చిన సినిమా ఆఫర్లు అన్ని కూడా వెనక్కిపోయాయి.
ఇక ఆతర్వాత కొన్ని సినిమాల్లో నటించిన అవి పెద్దగా హిట్ కాలేదు.దీంతో ఉదయ్ కిరణ్ సినీ కెరీర్ దారుణంగా పడిపోయింది.
ఆతర్వాత ఎప్పుడో ఒక సినిమాలో నటించిన ప్రేక్షకులు ఆ స్థాయిలో ఆదరించలేదు.చివరికి అతనే నిర్మాతగా వ్యవహరించి ఓ సినిమాలో నటించిన అది రిలీజ్ ఏ కాలేదు.
ఆతర్వాత ఆర్ధిక ఇబ్బందులు అని కొందరు.సినిమాల్లో అవకాశాలు లేక అని కొందరు.
మానసికంగా కుంగిపోవడం వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు కానీ అతడు నిజంగా ఏ విషయం వల్ల సూసైడ్చేసుకున్నాడు అనేది ఎవరికి తెలియదు.
ఏది ఏమైనా ఒక అద్భుతమైన నటుడు టాలీవుడ్ కి దూరం అయ్యాడు.
అయితే అతనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.ఆ వీడియోను చూసిన నెటిజన్లు అంత ”మిస్ యు ఉదయ్ కిరణ్” అంటూ కంటతడి పెడుతున్నారు.
ఆ వీడియోలో ఉదయ్ కిరణ్ కుక్క పిల్లతో ఆడుకుంటున్నాడు.అది ఇప్పుడు వైరల్ అవుతుంది.