కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీపై మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు.బీజేపీని విస్తరించడానికే సమావేశం అయ్యారని భావిస్తున్నట్లు తెలిపారు.
ఎన్టీఆర్ మద్ధతుతో బీజేపీని బలపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు.ఉపయోగం లేకపోతే మోదీ, షాలు ఒక్క నిమిషం కూడా ఎవరితో మాట్లాడరని పేర్కొన్నారు.
చంద్రబాబుతో ప్రయోజనం లేకే ఢిల్లీ వచ్చినా మోదీ కానీ, అమిత్ షా కానీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని వ్యాఖ్యనించారు.