పాత ఒక రోత.కొత్త ఒక వింత… ఇదే జపాన్ని ఫార్టీ ఇండస్ట్రీగా చెప్పుకునే టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు, నవతరం పాలిటిక్స్‌తో వ్యమకర్తలతో ముందుకు సాగుతున్న సీఎం జగన్ జపిస్తున్నారు.
ప్రస్తుతం ఏపీలోని రెండు టీడీపీ, వైసీపీ పార్టీల్లో ఇదే ఆసక్తికర అంశంగా మారుతోంది.పాత నేతలను పక్కనబెట్టి కొత్తవారికోసం సెర్చ్ చేస్తున్నట్టు సమాచారం.
కొత్తవారితోనే రాజకీయంగా ఎదగొచ్చని భావిస్తున్నాయి.కొత్తతరం నాయకులతో కొత్త జోష్ వస్తుందని, మరింత ఉత్సాహం నెలకొని చురుకుగా పనిచేస్తారని, తద్వారా రాజకీయ లబ్ధి పొందొచ్చని అంచనా వేస్తున్నారు.ఆ దిశగానే పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో వైసీపీ నిర్ణయాలు తీసుకుంటోంది.అందుకు కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడబోదని సమాచారం.వైసీపీకి ప్రస్తుతం 151మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.ఇందులో 100కు పైగా ఎమ్మెల్యేలు కొత్తవారే కావడం గమనార్హం.అందరూ మొదటిసారిగా చట్టసభల్లో అడుగుపెట్టిన వారే.
వీరిలో కొంతమంది పనితీరు సరిగా లేదని టాక్.సంబంధిత రిపోర్టులు కూడా వస్తున్నట్టు తెలసింది.
ఇదే సమయంలో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతోందని వైసీపీకి కూడా సమాచారం అందుతున్న పరిస్థతి.ఎలాగైనా వారిని తప్పించి కొత్తవారిని పరిచయం చేసి జోష్ నెలకొల్పాలని భావిస్తున్నట్టు సమాచారం.
కాగా ఇప్పటి నుంచే అభ్యర్థుల వేట మొదలెట్టినట్టు పలువురు చెబుతున్నారు.ప్రధానంగా ఆర్థిక, అంగ బలం ఉన్న నాయకుల వైపే మొగ్గు చూపుతున్నారని తెలిసింది.
ఇంతకాలం పాత కాపులకే టిక్కెట్లు ఇస్తూ వచ్చిన టీడీపీ కూడా కొత్తదనం కోసమే చూస్తోంది.కొత్తవారిని పార్టీకి పరిచయం చేసేందుకు పావులు కూడా కదుపుతున్నట్టు సమాచారం.అయితే పార్టీ సీనియార్టీ కంటే సీనియర్ నేతల వయసే ఎక్కువగా ఉండడం గమనార్హం.దీంతో ఎలాగైనా వచ్చే ఎన్నికల నాటికి పాత రోత వీడి కొత్తవింతకు ప్రయోగాలు చేసేందుకు బాబు సిద్ధపడుతున్నట్టు తెలిసింది.
కాగా ఇందులో వారసుల రాజకీయమే ఎక్కువగా ఉంటుందని టాక్.
ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది.టీడీపీ ప్రతిపక్షంలో ఉంది.మరి ఏపార్టీకి ఎంతవరకు మేలు చేకూరుతుంది ? అనేది ప్రశ్నార్థకమే.కొత్త వారితో ముందుకు సాగాలనుకోవడం రిస్క్‌తో కూడిన పని.ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ భారీగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పిస్తే ఇబ్బందులు తలెత్తక మానవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఏది ఏమైనా ఏపీలోని రెండు ప్రధాన పార్టీల్లో పాతవారు తక్కువమందే ఉన్నా రాబోయే ఎన్నికల వరకు రాజకీయ రణరంగం ఎలా మారుతుందో చూడాలి.