శని దేవుడి ఆగ్రహానికి గురి కాకూడదంటే.. శనివారం రోజు ఈ తప్పులను అస్సలు చేయకూడదు..!

శని దేవుని( Shani ) అనుగ్రహం పొందడానికి ప్రతి శనివారం రోజు శని దేవుని పూజించాలని పెద్దవారు చెబుతూ ఉంటారు.శనీశ్వరుడు న్యాయాన్ని ఇష్టపడే దేవుడు అని పండితులు చెబుతున్నారు.

 In Order Not To Incur The Wrath Of Lord Shani These Mistakes Should Not Be Done-TeluguStop.com

మనుషుల కర్మలను బట్టి వారికి ఫలాలను ఇస్తాడు.శనీశ్వరుడు( Saturn ) ఎవరినైనా దయతలిస్తే ఎలాంటి సమస్యలు లేకుండా వారి జీవితం ఆనందంగా సాగిపోయేలా కరుణిస్తాడు.

అయితే శని చెడు దృష్టి ఎవరిపై పడితే అతని జీవితం కష్టాలతో నిండిపోతుంది.దాని నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా అసలు వీలుకాదు.

Telugu Lord Shani, Saturday, Scissors, Vastu, Vastu Tips-Latest News - Telugu

శని దేవుడు మనిషి చేసే కొన్ని పనులకు త్వరగా కోపం తెచ్చుకుంటాడు.దీనికి కారణంగా ఒక వ్యక్తి తను చేపట్టే ఏ పనిలోనైనా నష్టాన్ని లేదా కష్టాన్ని అనుభవిస్తాడు.శని దేవుని విషయంలో పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి.వాటిని మీరు శనివారం( Saturday ) రోజు కచ్చితంగా మీరు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే శనివారం రోజు ఇనుప వస్తువులను అస్సలు కొనకూడదు.అలాగే శనివారం రోజు ఉప్పు కొనుగోలు చేయకూడదు.శనివారం రోజు ఉప్పు కొనుగోలు చేయడం వల్ల ఆ వ్యక్తికి అప్పులు పెరుగుతాయి.

Telugu Lord Shani, Saturday, Scissors, Vastu, Vastu Tips-Latest News - Telugu

అదే సమయంలో ఆర్థిక పరిస్థితి బలహీన పడుతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.అలాగే శనివారం రోజు కత్తెర కొనడం లేదా బహుమతిగా ఇవ్వడం చేయకూడదు.శనివారం కత్తెర వ్యాపారం( Scissors business ) చేయడం వల్ల కుటుంబ కలహాలు పెరుగుతాయని పెద్దవారు చెబుతున్నారు.

అలాగే పెద్దలను వీలైనంతగా గౌరవించాలి.పెద్దలను గౌరవించకపోతే శని దేవుడు ఆగ్రహిస్తాడు.

అలాగే కాళ్ళను నేలకు ఈడ్చి నడిచే వ్యక్తులను మీరు గమనించే ఉంటారు.అలాంటి వారిపై శని దేవుడు ఎప్పుడు కోపంగా ఉంటాడు.

అలాంటివారు ఏ పని మొదలుపెట్టిన ఆ పనిలో ఆటంకాలు ఏర్పడి చేసే పని సగంలోనే ఆగిపోతుంది.ముఖ్యంగా చెప్పాలంటే వంట గదిలో భోజనం చేసిన తర్వాత పాత్రలను తోమకుండా ఉంచడం వల్ల శని దేవుడికి కోపం వస్తుంది.

శని దేవుడు ఇలా చేసేవారికి కష్టాలను పెంచుతాడని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube