మీ దంతాల ఆకృతి.. మీ భవిష్యత్తు గురించి ఏం చెబుతుందో తెలుసుకోండి..?
TeluguStop.com
దంతాలు( Teeth ) మనిషి ముఖానికి అందాన్ని ఇవ్వడమే కాకుండా మనిషి ఆహారం తినడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
దంతాల ఆకృతి కూడా మనుషుల వ్యక్తిత్వాన్ని( Personality ) తెలియజేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచంలో ప్రతి ఒక్కరి ముఖ కవలికలు భిన్నంగా ఉంటాయి.ఇద్దరు వ్యక్తుల ముఖాల్లో కొన్ని పోలికలు కలుస్తాయేమో కానీ అచ్చు గుద్దినట్లు అస్సలు ఉండరు.
ఐడెంటికల్ కవలలు అయితే అచ్చుగుద్దినట్టు ఉంటారు.సముద్రిక శాస్త్రాన్ని అనుసరించి వ్యక్తుల దంతాల ఆకృతిని బట్టి వారి వ్యక్తిత్వాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
సాముద్రిక శాస్త్రన్ని( Samudrika Shastra ) అనుసరించి తెల్లగా అందమైన దంతాలు ఉన్నవారు అదృష్టవంతులు అని చెబుతున్నారు.
ఈ వ్యక్తుల స్వభావం స్నేహశీలమైనదిగా, ఉల్లాసంగా ఉంటుంది.అందరితో సామరస్యంగా జీవిస్తారు.
వీరినీ పోరాట పటిమ కలిగిన వారిగా చెప్పవచ్చు.దంతాల చిగుళ్ళు మందంగా బలంగా కనిపించే వ్యక్తి కాస్త అహంకారంతో ఉండే అవకాశం ఉంటుంది.
చిగుళ్ళు గులాబీ రంగులో ఉన్న వ్యక్తులు మర్యాద కలిగి ఉంటారు.వీరికి ఆయుష్షు కూడా ఎక్కువే.
"""/" /
పసుపు పచ్చ రంగులో దంతాలు ఉండేవారు చాలా నమ్మకమైన వ్యక్తులు.
వీరిని సులభంగా నమ్మవచ్చు.స్నేహ పూరిత మన స్వతం కలిగి ఉంటారు.
అలాగే వంకర టింకరగా, ఎగుడు దిగుడు దంతాలు ఉన్నవారు జీవితంలో కొన్ని అవకాశాలను కోల్పోతారని చెబుతున్నారు.
సాముద్రిక శాస్త్రం ప్రకారం దంతాలు సమంగా పైకి లేచినట్లు ఉండే సరళరేఖలో మృదువుగా అమర్చినట్లు ఉన్న వ్యక్తికి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు.
లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ వీరి వెంట ఉంటాయి. """/" /
ముఖ్యంగా చెప్పాలంటే దంతాల మధ్య అంతరం ఉన్న వ్యక్తులు తెలివైన వారై ఉంటారు.
ఈ వ్యక్తులు ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి పని చేయించుకోవడంలో నైపుణ్యం కలిగి ఉంటారు.
వీరు ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గని మనస్వతం కలిగి ఉంటారు.వీరి వ్యక్తిత్వం ప్రభావం వీరితో ఉండే వారి మీద తప్పకుండా ఉంటుంది.
ఓపెన్ మైండెడ్ గా వీరు ఉంటారు.తినడం, తాగడం ఎప్పుడూ పార్టీ మూడ్ లో ఉంటారు.
కెరీర్ లో చాలా త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు.అంతేకాకుండా వారి నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి.
పొడవైన దంతాలు ఉన్నవారు చాలా అనుభవజ్ఞులు, ధైర్యవంతులని నిపుణులు చెబుతున్నారు.