ప్రతి తరానికి ఒక స్టార్ హీరో తో పాటు ఒక స్టార్ హీరోయిన్( Star Heroine ) కూడా ఉంటుంది.పరిశ్రమలో ఎంతమంది హీరోయిన్ లు ఉన్న ఆ ఒక్కరు మాత్రం ప్రత్యేకం.
అలాంటి కోవకు చెందినవారే మహానటి సావిత్రి, శ్రీదేవి, సమంత తదితరులు.ఐతే వీలందరిలో ఒక కామన్ పాయింట్ ఉంది గమనించారా? అదేంటంటే వీళ్లందరి పేర్లు “ఎస్” తోనే( S Letter ) మొదలవుతున్నాయి.మన తాతల కాలంలో సినిమా పరిశ్రమను పాలించిన మహానటి సావిత్రి( Mahanati Savitri ) నుంచి ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న శ్రీలీల( Sreeleela ) వరకు, ఇలా ప్రతి తరంలో అగ్ర కథానాయకి ల పేర్లు “ఎస్” తోనే మొదలవుతున్నాయి.ఇది మీరు ఎప్పుడైనా గమనించారా? ఆ అగ్ర కథానాయకిలు ఎవరో ఇప్పుడు చూసేద్దాం.
సావిత్రి:
మన తెలుగువారికి మొదటి అభిమాన కథానాయకి ఎవరు అంటే సావిత్రి అనే చెప్పాలి.ఆమె గురించి ఎంత చెప్పిన తక్కువే.ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి స్టార్ హీరోలతో ధీటుగా నటించి మహానటి గా పేరు తెచ్చుకుంది సావిత్రి.కనుక హీరోయిన్ లలో ఎప్పటికి ఈమె మొదటి సూపర్ స్టార్.
శ్రీదేవి:
అందం అనే పదానికి నిలువెత్తు రూపం శ్రీదేవి.( Sridevi ) కేవలం అందం లోనే కాదు, అభినయంలోనూ ఈమెను కొట్టేవారు లేరు.భారత దేశ సినీ ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసిన అతిలోక సుందరి శ్రీదేవి.
సౌందర్య:
మహానటి సావిత్రి తరువాత పద్దతి, సాంప్రదాయం అంటే గుర్తోచ్చేది సౌందర్య.( Soundarya ) 1993 లో మనవరాలి పెళ్లి చిత్రంతో మొదలుపెట్టి, ఒక దశాబ్దం పాటు అనేక సూపర్ హిట్ చిత్రాలలో, అందరు స్టార్ హీరోలతో నటించి టాప్ హీరోయిన్ గా నిలిచింది.
సిమ్రాన్:
హీరోయిన్ లు కూడా హీరోలకు ధీటుగా డాన్స్ చెయ్యగలరు అని నిరూపించిన హీరోయిన్ సిమ్రాన్.( Simran ) మెగా స్టార్ చిరంజీవి, నట సింహం బాలకృష్ణ వంటి స్టార్ హీరోలకు ధీటుగా తన నటనతో , డాన్స్ తో అందర్నీ ఆకట్టుకుంది సిమ్రాన్.
శ్రీయ:
శ్రీయతో( Shriya Saran ) కలిసి నటించని హీరో లేడేమో తెలుగు సినీ పరిశ్రమలో.చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, జూనియర్ ఎన్ఠీఆర్ , మహేష్ బాబు, తరుణ్.ఇలా మూడు తరాల హీరోలతో కలిసి నటించిన 23 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం ఈమెది.
సమంత:
ఏ మాయ చేసావే చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమిన సమంత( Samantha ) తన అందంతో అభినయంతో నిజంగానే అందర్నీ మాయ చేసింది.కమర్షియల్ సినిమాలలో నటిస్తూనే ఎన్నో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది సమంత.
సాయి పల్లవి:
హీరోయిన్ అంటే అందం అని, ఎక్సపోసింగ్ చెయ్యకపోతే కుదరదనే అపోహలను చెరిపేసింది సాయి పల్లవి.( Sai Pallavi ) తన పక్కింటి అమ్మాయి ఆకృతితో, మనసులను హత్తుకునే అభినయంతో అందర్నీ ఫిదా చేసింది సాయి పల్లవి.
శ్రీలీల:
ప్రస్తుతం సినీ పరిశ్రమలో సెన్సేషన్ శ్రీలీల.( Sreeleela ) పెళ్ళిసందడి చిత్రంతో అరంగేట్రం చేసి ఇప్పుడు వరుస సినిమాలతో ద్దోసుకుపోతోంది శ్రీలీల.మహానటి సావిత్రి లాగానే శ్రీలీల కూడా తెలుగు అమ్మాయి.ప్రస్తుతం ఈమె జోరు చూస్తుంటే, నెక్స్ట్ లేడీ సూపర్ స్టార్ అయ్యేలానే ఉంది.