తిరుమల నడకదారిలో చిరుత పులి సంచారం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు.ఈ మేరకు ఏడవ మైలు వద్ద దర్శనానికి వస్తున్న చిన్న పిల్లల చేతికి పోలీస్ సిబ్బంది ట్యాగ్ లు వేస్తున్నారు.
తల్లిదండ్రుల నుంచి పిల్లలు తప్పిపోతే సులభంగా కనిపెట్టేందుకు పోలీస్ సిబ్బంది ఈ ట్యాగ్ లను వేస్తున్నారని తెలుస్తోంది.ట్యాగ్ పై పేరు, తల్లిదండ్రుల వివరాలతో పాటు ఫోన్ నంబర్, పోలీస్ టోల్ ఫ్రీ నంబర్ ను వేస్తున్నారు.
కాగా ఇప్పటికే చిరుతను బంధించేందుకు గానూ మూడు బోన్లతో పాటు భక్తుల భద్రత కోసం సుమారు ఐదు వందల సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.







