సాధారణంగా కొందరు ఎంత వయసు వచ్చినా కూడా చాలా యంగ్ గా కనిపిస్తుంటారు.వారి ముఖంపై ఒక్క ముడత కూడా కనిపించదు.
అటువంటి చర్మాన్ని దాదాపు అందరూ కోరుకుంటారు.కానీ స్కిన్ కేర్( Skin care ) విషయంలో అజాగ్రత్త వహిస్తారు.
అయితే ఏజ్ పెరిగినా( Age increases ) యవ్వనంగా కనిపించాలని భావించేవారు ఇప్పుడు చెప్పబోయే రెమెడీని అస్సలు మిస్ అవ్వకండి.
అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు మెంతులను స్లైట్ గా వేయించుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించుకున్న మెంతులు( fenugreek ), వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్( Chia seeds ) వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకుని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టీ స్పూన్ మెంతులు, చియా సీడ్స్ పౌడర్ వేసుకోవాలి.
అలాగే పావు టీ స్పూన్ జాజికాయ పొడి( Nutmeg powder ), సరిపడా పచ్చి పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని కళ్ళల్లోకి పోకుండా ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండుసార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే అదిరిపోయే స్కిన్ కేర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.
ఈ రెమెడీ స్కిన్ ఏజింగ్ ను ఆలస్యం చేస్తుంది.చర్మం యవ్వనంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.ముడతలు, చారలకు చెక్ పెడుతుంది.సాగిన చర్మాన్ని టైట్ గా మారుస్తుంది.

చర్మ రంధ్రాలను తెరుచుకోవడానికి మరియు చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి తోడ్పడుతుంది.అలాగే మెంతులు, చియా సీడ్స్ చర్మంపై మొండి మచ్చలను నివారిస్తాయి.జాజికాయలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి.మొత్తంగా ఈ రెమెడీ మచ్చలేని మెరిసే యవ్వనమైన చర్మాన్ని మీ సొంతం చేస్తుంది.








