వడ దెబ్బతో వ్వక్తి మృతి

సూర్యాపేట జిల్లా:కోదాడ రూరల్ మండలం రామాపురం గ్రామానికి చెందిన నెలమర్రి యాకోబు (37) వడదెబ్బతో మృత్యువాత పడ్డారు.దినసరి కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగించే యాకోబు రోజువారీ పనిలో భాగంగా గడ్డి మోపులు కట్టడానికి కూలికి వెళ్లి ఎండకు తాళలేక నీరసంగా ఇంటికి చేరుకున్నాడు.

 Man Dies Of Sunstroke-TeluguStop.com

అదే సమయంలో తన రెండవ కూతురు అనారోగ్యంతో ఉండటంతో ఆమెను కోదాడ హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స చేయించుకొని వచ్చాడు.అదే రోజు తన పెద్ద కూతురు నడిగూడెం గురుకుల పాఠశాలలో చదువుతుండగా,పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో ఆమెను తీసుకురావడాని ఎండలోనే కోదాడ నుండి నడిగూడెం ఆటోలో బయలుదేరాడు.

పొద్దంతా ఎండలో తిరగడం కారణంగా మళ్ళీ కాళ్ళు చేతులు లాగుతుందటంతో నడిగూడెం ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్లి చూపించుకున్నాడు.అతన్ని పరీక్షించిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం కోదాడ వెళ్లాలని సూచించడంతో కోదాడకి వెళ్తుండగా పరిస్థితి విషమించి మార్గమధ్యంలోనే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అతనికి భార్య,ముగ్గురు కూతుర్లు ఉన్నారు.రెక్కాడితే డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన యాకోబు మరణంతో ఆ కుటుంబం వీధిన పడిందని,ప్రభుత్వం వారి కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని ఆదుకోవాలని బంధువులు, స్థానికులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube