ఆ దేశంలో కూడా BHIM UPI ద్వారా చెల్లింపులు...

మీరు UAEకి వెళ్తున్నారా? అయితే, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మీకు శుభవార్త చెప్పింది.NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL) తాజాగా BHIM UPI ఇప్పుడు UAEలోని NEOPAY టెర్మినల్స్‌లో లావాదేవీలు కొనసాగిస్తుందని తెలిపింది.

 ఆ దేశంలో కూడా Bhim Upi ద్వారా చెల్ల-TeluguStop.com

ఈ అప్‌డేట్‌తో ఇకపై UAEకి ప్రయాణించే భారతీయ పౌరులు ఎవరైనా తమ అవసరాలకు BHIM UPI ద్వారా చెల్లింపులు చేయగలుగుతారు.ఈ నూతన విధానంతో యుఎఇకి ప్రయాణించే లక్షలాది మంది భారతీయులు ఇప్పుడు BHIM UPI ద్వారా సురక్షితమైన సులభమైన పద్ధతిలో చెల్లింపులు చేయగలుగుతారని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ప్రక్రియ కోసం NIPL మష్రెక్ బ్యాంక్‌కు చెల్లింపుల అనుబంధ సంస్థ అయిన NEOPAYతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది.దీనితో పరస్పర మౌలిక సదుపాయాలు ఏర్పడ్డాయి.BHIM UPI అనేది UAE అంతటా వినియోగించలేరు.NEOPAY టెర్మినల్స్ వద్ద మాత్రమే దీనిని వినియోగించవచ్చు.

ఈ ఫీచర్‌ని ఉపయోగించడం చాలా సులభం.చెల్లింపులు చేయడానికి వినియోగదారులందరికీ భారతదేశంలో రిజిస్టర్డ్ బ్యాంక్ ఖాతా, UPI కనెక్టివిటీ, UPI ఆధారిత యాప్ అవసరం.

ఈ భాగస్వామ్యంతో, NEOPAY టెర్మినల్స్ చెల్లింపు మొత్తాన్ని రూపాయిలుగా మారుస్తుంది.అదే ప్రాతిపదికన వినియోగదారులకు ఛార్జీలు విధిస్తారు.

Telugu Bhim Upi, Bhim Upi Uae, Central, Dubai, Indian Citizens, Nepal, Singapore

UPI ఆధారిత చెల్లింపులు ఏఏ దేశాల్లో అందుబాటులో ఉన్నాయి?

UAE కన్నా ముందుగా గత ఏడాది జూలైలో భారతదేశానికి చెందిన BHIM UPIని స్వీకరించిన ప్రపంచంలోనే మొదటి దేశం భూటాన్. దీని తరువాత ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నేపాల్ BHIM UPIని స్వీకరించింది.అదేవిధంగా సింగపూర్ గత సంవత్సరం ప్లాట్‌ఫారమ్‌ను స్వీకరించింది.ఈ సేవలను ఈ సంవత్సరం జూలై నుండి ప్రారంభించే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube